అన్నీ ఆలోచించే చంద్రబాబు అరెస్ట్ - హీరో సుమన్..!!

ఏపీలో చంద్రబాబు(Chandra Babu) అరెస్ట్ తో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. చంద్రబాబు మద్దతు దారులు వైసీపీ(YSRCP) ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన కొందరు చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్(Rajinikanth), విశాల్(Vishal) సైతం చంద్రబాబు అరెస్ట్ పైన స్పందించారు. ఇప్పుడు మరో సినీ ప్రముఖులు సుమన్(Suman) ఇదే అంశం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. రాజకీయాల్లో ఇది ఒక గుణపాఠంగా పేర్కొన్నారు.

తెలుగు దేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ పైన సినీ నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు(Chandra Babu) డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా చూసి చెప్పే జ్యోతిష్కుడు ఉంటే ఆయన ఎప్పుడు వస్తారో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. టైం అనేది బాగుంటే లోకల్ కోర్టులో కూడా అన్నీ అనుకూలంగానే జరుగుతాయన్నారు. ఆయనకు అన్నీ అనుకూలంగా వచ్చే వరకు జైలు(Jail)లలోనే ఉంటారని వ్యాఖ్యానించారు.

Cine Actor Suman Reacts over TDP Chief Chandra Babu Arrest, made interesting comments

మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటప్పుడు అన్నీ ఆలోచించాకే అరెస్ట్ చేసి ఉంటారని చెప్పుకొచ్చారు. సీఎం జగన్(CM YS Jagan) వల్లే చంద్రబాబు(Chandra Babu) జైలుకు వెళ్లి ఉంటారని అంటున్నారని..కానీ, అది నిజం కాదని సుమన్(Suman) పేర్కొన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేయటానికి చాలా కారణాలు ఉండి ఉంటాయని చెప్పారు

సమయం మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయని సుమన్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే చంద్రబాబు బెయిల్(Chandra Babu Bail) కోసం ఆయన తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. రేపు బెయిల్ పిటీషన్ పైన విచారణ జరగనుంది. ఇదే సమయంలో సుప్రీం కోర్టు(Supreme Court)లో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ ను సీజే బెంచ్ ముందు మంగళవారం మెన్షన్ చేయనున్నారు.

ఆ సమయంలో ఎప్పుడు ఈ పిటీషన్ విచారణకు తీసుకోవాలనేది నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది. ఇటు చంద్రబాబు ను మరోసారి కస్టడీకి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటీషన్ కూడా మంగళవారం విచారణకు రానుంది. దీంతో, చంద్రబాబు(Chandra Babu) కేసు విచారణలో మంగళవారం కీలకం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+