జరిగింది ఇది! ‘ముప్పావలా’ సినిమాపై క్లారిటీ ఇచ్చిన రాంగోపాల్ వర్మ, జగన్, పవన్ ఫ్యాన్స్ ఫైట్

హైదరాబాద్: ప్రముఖ వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే పలు జీవిత కథలతో సినిమాలు తీసి సంచలనాలు సృష్టించడమే గాక, సరికొత్త వివాదాలకు కూడా తెరతీశారు. తాజాగా, జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్‌పై 'ముప్పావలా' అంటూ కొత్త సినిమా తీస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీంతో పవన్ అభిమానులు రాంగోపాల్ వర్మను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడిని కొనసాగించారు.

‘ముప్పావలా' సినిమా ప్రకటన

‘ముప్పావలా' సినిమా ప్రకటన

ఈ క్రమంలో రాంగోపాల్ వర్మ అసలు విషయం చెప్పి ఈ తాజా వివాదానికి ముగింపు పలికారు. అసలు ఏం జరిగిందంటే.. రాంగోపాల్ వర్మ అధికారిక ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ గురించిన ఓ సినిమా ప్రారంభిస్తున్నట్లు జనవరి 16న ప్రకటించారు. ఆ సినిమాకు ‘ముప్పావలా' అనే పేరును ఖరారు చేశారు. దీంతో పవన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్మపై విమర్శలు ఎక్కుపెట్టారు.

నేను కాదంటూ వర్మ క్లారిటీ..

ఈ నేపథ్యంలో కొంచెం లేటుగానైనా ఈ సినిమాపై స్పందించారు. అసలు పవన్ కళ్యాణ్‌పై తాను ఎలాంటి సినిమా తీయడం లేదని స్పష్టం చేశారు. ఆ ట్వీటు కూడా తాను చేయలేదని చెప్పారు. ఆ ట్వీటు కావాలనే ఎవరో క్రియేట్ చేశారని అన్నారు. కావాలంటే తన ట్విట్టర్ హిస్టరీని చెక్ చేసుకోవచ్చని తెలిపారు. దీంతో ముప్పావలాపై స్పష్టత వచ్చినట్లయింది.

పవన్, జగన్ అభిమానుల రచ్చ

పవన్, జగన్ అభిమానుల రచ్చ

కాగా, రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్‌కు ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు కామెంట్ల రూపంలో పెద్ద యుద్ధమే చేస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని లక్ష్యంగా చేసుకుని జగన్ అభిమానులు పవన్‌పై విమర్శలు గుప్పిస్తుంటే.. జగన్ కేసులను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ అభిమానులు కౌంటర్లు ఇస్తున్నారు. వివరణ ఇచ్చినప్పటికీ మరికొందరు వర్మపైనా విమర్శలు చేస్తుండటం గమనార్హం.

వివాదాలతోనే ప్రచారం..

వివాదాలతోనే ప్రచారం..

రాంగోపాల్ వర్మ సినిమా వస్తుందంటే.. ఆ సినిమాకు ఎక్కువగా వివాదాలతోనే ప్రచారం జరుగుతుంది. ఇటీవల కాలంలో వచ్చిన పలు సినిమాలు అలాగే ఉండటం గమనార్హం.

ఇటీవలే ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' అంటూ ఓ సినిమా తీసిన రాంగోపాల్ వర్మ పెను దుమారమే రేపింది. ప్రస్తుత రాజకీయ పార్టీల నేతలపై సెటైరికల్‌గా ఉన్న ఈ సినిమాను తీసిన వర్మపై అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు విమర్శలు గుప్పించారు.
అంతకుముందు దివంగత మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌పై తీసిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా ఓ వర్గం నుంచి విమర్శలను ఎదుర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+