పవన్: బాలకృష్ణే పెద్ద ఎసెట్, నాటి నుండి వారే (పిక్చర్స్)

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీలోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయమై పవన్ పెదవి విప్పనప్పటికీ ఇంటర్నెట్లో హల్ చల్ చేయడమే కాకుండా టిడిపి నాయకులు వస్తే ఆహ్వానిస్తామని చెప్పారు. అయితే పవన్ మదిలో ఏముందో మాత్రం ఎవరికీ తెలియదు. ఇంకా చెప్పాలంటే పవన్ టిడిపి వైపు అడుగులు వేసే ప్రసక్తే లేదని అంటున్నారు. ఇదంతా వట్టి ప్రచారమేనని కొట్టి పారేస్తున్నారు.

టిడిపిలో మొదటి నుండి సినీ గ్లామర్ కనిపిస్తుందనే చెప్పవచ్చు. ఆ పార్టీని స్థాపించిందే నవరస నటనా సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. మిగతా పార్టీలలోను సినీ గ్లామర్ కనిపిస్తోంది. అయితే ఎన్టీఆర్ టిడిపిని స్థాపించాకే దానికి ఊపు వచ్చిందని చెప్పవచ్చు. అయితే టిడిపిలో సినీ గ్లామర్‌కు మాత్రం కొదువ లేదు. అయితే అధికారంలో ఉన్నప్పుడున్నంత సినీ గ్లామర్ ఇప్పుడు లేదనే చెప్పవచ్చు.

సీనియర్ నటులు గీతాంజలి, కవితలు ఇప్పటికీ టిడిపిలో కొనసాగుతున్నారు. అధికారం పోయిన తరువాత కూడా కొంతకాలం రోజా పార్టీలో ఒక వెలుగు వెలిగినా, 2009 ఓటమి తరువాత ఆమె కాంగ్రెస్‌కు, తరువాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి మారిపోయారు. ఇప్పుడు మిగిలింది ఆ పార్టీకి పెద్ద ఎస్సెట్ నందమూరి బాలకృష్ణ మాత్రమే. రాజమండ్రి నుంచి పోటీ చేయనున్న పాతతరం నటుడు మురళీ మోహన్ బాబుకు సన్నిహితులు.

ప్రజల్లో ఇప్పటికీ మంచి ఆదరణ ఉన్న నటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు బాబుకు మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. జూనియర్ టిడిపికి దూరంగానే ఉంటున్నారు. రోజా సైతం పార్టీ వీడి వెళ్లిన తరువాత సినిమా గ్లామర్ కోసం తెదేపా ఎదురు చూడక తప్పటం లేదు. జయప్రద టిడిపిలో చేరనున్నట్టు పార్టీ నేతలు ప్రచారం చేశారు. ఆమె మాత్రం కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసుల మధ్య ఊగిసలాడుతూ సోనియాని కలిశారు. ఆమె టిడిపి ద్వారానే రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. గత నాలుగైదు నెలల నుంచీ పవన్ కళ్యాణ్ తెదేపాలో చేరుతారంటూ పార్టీ అభిమానులు ప్రచారం మొదలెట్టారు.

ఎన్టీఆర్

ఎన్టీఆర్

తెలుగుదేశం పార్టీని స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించారు. చిత్ర పరిశ్రమలో అందరి మన్ననలు పొందిన ఆయన పార్టీని స్థాపించిన కొద్ది నెలల్లోనే అధికారంలోకి వచ్చారు.

రోజా

రోజా

ప్రముఖ నటి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నేత రోజా కొంతకాలం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెసు అటు నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లారు.

జయప్రద

జయప్రద

నిన్నటితరం కథానాయిక జయప్రద టిడిపి ద్వారానే రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్‌కు వెళ్లారు. 2014 నాటికి రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు.

కవిత

కవిత

ప్రముఖ నటి కవిత మొదటి నుండి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఆమెతో పాటు అలనాటి నటి గీతాంజలి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు.

జూ ఎన్టీఆర్

జూ ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2009లో తెలుగుదేశం పార్టీ తరఫున జోరుగా ప్రచారం చేశారు. అయితే ఇటీవల వారసత్వ విభేదాల వల్ల గ్యాప్ పెరిగింది. అయితే ఎన్టీఆర్ మాత్రం తాను ఎప్పుడు తాత స్థాపించిన పార్టీకోసం పని చేస్తానని చెప్పారు.

కల్యాణ్ రామ్ - నారా రోహిత్

కల్యాణ్ రామ్ - నారా రోహిత్

నందమూరి హరికృష్ణ తనయుడు నందమూరి కల్యాణ్ రామ్ టిడిపి వెన్నంటే ఉంటున్నారు. చంద్రబాబు సోదరుడి తనయుడు, హీరో నారా రోహిత్ కూడా అండగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నారు.

బాలకృష్ణ

బాలకృష్ణ

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎస్సెట్ బాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణే. 2014 ఎన్నికల్లో అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్

గత కొన్ని నెలలుగా పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీలోకి వస్తారంటూ జోరుగా పుకార్లు వస్తున్నాయి. దీనిపై పవన్ కల్యాణ్ పెదవి విప్పితే గానీ తెలియదంటున్నప్పటికీ ఆయన టిడిపిలోకి వచ్చేదంతా వట్టిదే అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+