వైసీపీకీ వంతపాడి పెద్దిరెడ్డి భజన చేసిన పోలీసు, బాబు దెబ్బకు కుప్పంలో మామలు వాషౌట్
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కుప్పం నియోజక వర్గానికి వెళ్లిన నారా చంద్రబాబు నాయుడు నానా ఇబ్బందులు పడ్డారు. అయితే కుప్పంలో చంద్రబాబును ఇబ్బందులు పెట్టి వైసీపీకి భజన చేసిన పోలీసు అధికారులు అందరూ ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకున్నారు. చంద్రబాబు సీఎం అయిన తరువాత ఇంతకాలం కుప్పంలో హంగామా చేసిన పోలీసు అధికారులకు ఇప్పుడు ఎక్కడా పోస్టింగులు లేకపోవడంతో తల పట్టుకున్నారు.
ఇంతకాలం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాటే శాసనం అంటూ కుప్పం నియోజక వర్గంలో మకాం వేసిన పోలీసు అధికారులు ఇప్పుడు వీఆర్ లో ఉన్నారు. కుప్పం అర్బన్ సీఐ ఎన్ వీ రమణ, కుప్పం రూరల్ సీఐ ఈశ్వర్ రెడ్డి, రామకుప్పం ఎస్ఐ శివకుమార్, రాళ్లబూదుగూరు ఎస్ఐ సుమన్, కుప్పం అర్బన్ ఎస్ఐ సుబ్బారెడ్డి, గుడుపల్లె ఎస్ఐ లక్ష్మీకాంత్ ను ఒకే సారి వీఆర్ కు పంపిస్తూ అనంతపురం రైంజ్ డీఐజీ షేముషి బాజ్ పాయ్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు.

కుప్పం అర్బన్ సీఐగా పని చేసిన రమణ టీటీడీ కార్యకర్తలను టార్గేట్ చేసేవాడని ఆరోపణలు ఉన్నాయి. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎమ్మెల్సీ భరత్ చెప్పినట్లు తల ఊపిన సీఐ రమణ టీడీపీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. కుప్పం గ్రామీణ సీఐ ఈశ్వర్ రెడ్డి అయితే నిత్యం పెద్దిరెడ్డి భజన చేస్తూ వైసీపీకి వంతపాడేశాడని ఆరోపణలు ఉన్నాయి.
ఇక ఎస్ఐ సుమన్ మొదటి నుంచి వైసీపీకి అనుకూలంగా ఉండేవాడని ఆరోపణలు ఉన్నాయి. కుప్పం అర్బన్ ఎస్ఐ సుబ్బారెడ్డి కూడా వైసీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తూ పెద్దిరెడ్డి చెప్పింది తూచా తప్పకుండా పాటించాడని ఆరోపణలు ఉన్నాయి. వీరందరితో పాటు హెడ్ కానిస్టేబుల్ మోహన్ ది అదే తీరు అని, ఎమ్మెల్సీ భరత్ చెప్పినట్లు నడుచుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి.
గుడుపల్లె ఎస్ఐగా పని చేసిన లక్ష్మీకాంత్ అయితే పెద్దిరెడ్డికి వీర భక్తుడు అని పేరు ఉంది. గతంలో సదుం ఎస్ఐగా పని చేసిన లక్ష్మీకాంత్ పెద్దిరెడ్డి అండదండలతో గుడుపల్లె ఎస్ఐగా బదిలి చేయించుకున్నాడు. రామకుప్పం ఎస్ఐ శివకుమార్ కూడా పెద్దిరెడ్డి చెప్పినట్లు చేశాడని ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వెంట తిరిగారని నలుగురి మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిచాడని ఎస్ఐ శివకుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కుప్పం పర్యటన సందర్బంగా వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను అడ్డం పెట్టుకుని చంద్రబాబుకు అడుగడుగునా ఇబ్బందులకు గురి చేశారని ఆరు మంది పోలీసు అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు సీఎం అయిన తరువాత కూడా వీళ్లు కొన్ని రోజులు ఇదే ప్రాంతంలో ఉన్నారు. అయితే ఇంతకాలం పెద్దిరెడ్డి భజన చేస్తూ వైసీపీ నాయకులకు వంతపాడిన ఆరు మంది పోలీసు అధికారులను ఒకేసారి వీఆర్ కు పంపించారు.












Click it and Unblock the Notifications