నగర కాంగ్రెస్ అభ్యర్థులు వీరేనా! జగన్ పార్టీలోకి దినేష్?
హైదరాబాద్: రానున్న సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఫైనలైజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ నటి జయసుధ మరోసారి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు.
సమాచారం మేరకు... జయసుధ (సికింద్రాబాద్), వినోద్ (నాంపల్లి) క్రిశాంక్ (కంటోన్మెంట్), డాక్టర్ వినయ్ (ముషీరాబాద్), నర్సింహ యాదవ్ (కూకట్ పల్లి), విష్ణువర్ధన్ రెడ్డి (జూబ్లీహిల్స్), సుధీర్ రెడ్డి (ఎల్బీ నగర్), వి హనుమంత రావు (అంబర్ పేట), కూన శ్రీశైలం గౌడ్ (కుత్బుల్లాపూర్), దానం నాగేందర్ (ఖైరతాబాద్) తదితరులు ఖరారైనట్లుగా తెలుస్తోంది.

జగన్‌ను కలిసిన అశోక్ బాబు
ఎపిఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబు ఆదివారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. జగన్‌ను కలిసిన అనంతరం అశోక్ బాబు మాట్లాడుతూ... అందరు కలిసి పని చేయాలని జగన్ సూచించారని తెలిపారు. తాను ఉద్యోగ సంఘాలకు వ్యతిరేకం కాదని చెప్పారన్నారు.
జగన్ పార్టీలోకి దినేష్ రెడ్డి?
మాజీ డిజిపి దినేష్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తారనే ప్రచారం సాగుతోంది. గతంలో ఆయన బిజెపిలో చేరి ఒంగోలు నుండి లోకసభకు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు ఆయన జగన్ పార్టీలో చేరి అదే నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లేదా మల్కాజిగిరి నుండి పోటీ చేసే అవకాశముంది.












Click it and Unblock the Notifications