రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఈ జిల్లాల్లో ఇక నుంచి కొత్తగా..!!

ఏపీ ప్రభుత్వ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పౌర సరఫరా వ్యవస్థలో పలు మార్పులు తెచ్చింది. రేషన్ లబ్దిదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తోంది. తిరిగి రేషన్ దుకాణాలను ప్రారంభించింది. అదే విధంగా ఇప్పుడు రేషన్ తో పాటుగా ప్రజల ఆరోగ్యం, మారుతున్న ఆహారపు అలవాట్లను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది.

ఏపీ ప్రభుత్వం పేదలకు పోషక విలువలు కలిగిన తృణధాన్యాలను ఉచితంగానే సరఫరా చేస్తోంది. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, శ్రీసత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప, నంద్యాల జిల్లాల్లో గత ఏప్రిల్‌ నుంచే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్‌ కార్డుదారులకు బియ్యం, పంచదారతోపాటు రాగులు, జొన్నలు పంపిణీ చేస్తోంది. ఈ డిసెంబరు నెల నుంచి రాగుల పంపిణీని ఉత్తర కోస్తా ప్రాంతంలోని విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు విస్తరించింది. ఎన్టీఆర్‌, గుం టూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో జొన్నల పంపిణీని ప్రారంభించింది. ప్రభుత్వం మనిషికి 5 కేజీల చొప్పున బియ్యాన్ని ఉచితంగానే పంపిణీ చేస్తోంది. ఈ రేషన్‌లో కొంతమేర బియ్యానికి బదులుగా గరిష్ఠంగా 3 కేజీల వరకు రాగులు, జొన్నలు పంపిణీ చేయాలని నిర్ణయించింది.

civil-supplies-to-re-launch-supply-of-millets-with-ration-distribution-across-the-state

తాజా నిర్ణయం మేరకు ప్రతినెలా 20 కేజీల రేషన్‌ బియ్యం తీసుకునే కుటుంబం.. ఇప్పుడు రెండు కేజీల రాగులు మాత్రమే కావాలనుకుంటే.. ఆ మేరకు బియ్యాన్ని మినహాయించుకుని, మిగిలిన 18 కేజీల బియ్యాన్ని, 2 కేజీల రాగులను అందిస్తారు. గతంలోనూ టీడీపీ ప్ర భుత్వం ఇదేవిధంగా రేషన్‌కార్డుదారులకు రాగు లు, రాగిపిండిని ప్యాకెట్ల రూపంలో పంపి ణీ చేసింది. ఇప్పుడు మళ్లీ టీడీపీ కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక రేషన్‌ సరుకుల్లో తృణ ధాన్యాలను అందించాలని నిర్ణయుంచింది. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వమే వాటిని టెండరు ప్రక్రియ ద్వారా ప్రొక్యూర్‌ చేస్తూ కార్డుదారులకు ఉచితంగా సరఫరా చేస్తోంది. రాగులు, జొన్నల పట్ల ప్రజలు ఆసక్తి చూపుతుండటంతో వీటిని దశలవారీగా అన్ని జిల్లాల్లోనూ పంపిణీ చేసేందుకు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కసరత్తు మొదలు పెట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+