విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సివిల్స్ ప్రిలిమ్స్ ప్రశాంతం: టి, ఏపిల్లో తగ్గారు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: యుపిఎస్‌సి ఆదివారం నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో 4.5 లక్షల మంది హాజరయ్యారు. సివిల్ సర్వీస్ పరీక్ష విధానాన్ని మార్చాలని డిమాండ్ చేస్తూ దేశంలో అనేకచోట్ల విద్యార్థులు ఆందోళన చేయడంతో ప్రిలిమినరీ పరీక్ష వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం ఎక్కడా ఎలాంటి ఆందోళన సంఘటనలు జరగలేదని, పరీక్ష ప్రశాంతంగా జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి.

నిరుడు కంటే ఈ సంవత్సరం 1.27 లక్షల మంది ఎక్కువగా హాజరై.. మొత్తం దరఖాస్తు చేసుకున్న 9లక్షల మందిలో సగం మాత్రమే కావడం గమనార్హం. ఈ హాజరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మరింత తక్కువగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌లలో వరుసగా 32, 37, 47 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని పలు పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ముకేష్ కుమార్ మీనా పర్యవేక్షించారు. నగరంలో సుమారు 18వేల మంది పరీక్షకు హాజరయ్యారు.

ఈ ఏడాది దేశ వ్యాప్తంగా కొత్తగా 14 నగరాలు, పట్టణాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. కొంతమంది పేపర్1లో ఇంగ్లీష్‌లో అడిగిన ప్రశ్నలకు హిందీ అనువాదానికి సంబంధించి కొన్ని ఫిర్యాదులు చేశారు. అయితే విద్యార్థుల ఫిర్యాదుపై ప్రభుత్వం కానీ, పరీక్ష నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు.

ప్రిలిమ్స్

ప్రిలిమ్స్

యుపిఎస్‌సి ఆదివారం నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో 4.5 లక్షల మంది హాజరయ్యారు.

ప్రిలిమ్స్

ప్రిలిమ్స్

సివిల్ సర్వీస్ పరీక్ష విధానాన్ని మార్చాలని డిమాండ్ చేస్తూ దేశంలో అనేకచోట్ల విద్యార్థులు ఆందోళన చేయడంతో ప్రిలిమినరీ పరీక్ష వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.

ప్రిలిమ్స్

ప్రిలిమ్స్

అయితే ఆదివారం ఎక్కడా ఎలాంటి ఆందోళన సంఘటనలు జరగలేదని, పరీక్ష ప్రశాంతంగా జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి.

ప్రిలిమ్స్

ప్రిలిమ్స్

నిరుడు కంటే ఈ సంవత్సరం 1.27 లక్షల మంది ఎక్కువగా హాజరై.. మొత్తం దరఖాస్తు చేసుకున్న 9లక్షల మందిలో సగం మాత్రమే కావడం గమనార్హం.

ప్రిలిమ్స్

ప్రిలిమ్స్

విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌లలో వరుసగా 32, 37, 47 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.

ప్రిలిమ్స్

ప్రిలిమ్స్

హైదరాబాద్‌లోని పలు పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ముకేష్ కుమార్ మీనా పర్యవేక్షించారు. నగరంలో సుమారు 18వేల మంది పరీక్షకు హాజరయ్యారు.

English summary

 The civil services prelims examination which was conducted at Vijayawada, Visakhapatnam and Hyderabad on Sunday passed off peacefully. However, authorities said many candidates skipped the exam and the attendance percentage was very low.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X