కాంగ్రెసుకు చేయి: జగన్ పార్టీలోకి ఎమ్మెల్యే సికె బాబు

సికె బాబుగా సుపరిచితులైన సికె జయచంద్రారెడ్డి తొలుత చిత్తూరు శాసనసభా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత మూడు సార్లు కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.
1994, 1999, 2009 ఎన్నికల్లో ఆయన కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. వైయస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ద్వారా మాత్రమే ప్రజలకు చేరుతాని నమ్ముతున్నట్లు ఆయన తెలిపారు. ఇరు ప్రాంతాల అభివృద్ధి కూడా వైయస్ జగన్ వల్లనే సాధ్యమని ఆయన అన్నారు.
నిజానికి, సికె బాబు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారంటూ చాలా కాలంగా ప్రచారం సాగుతూ వచ్చింది. కానీ, ఎందుకో గానీ ఆయన ఇప్పటి దాకా ఆగిపోయారు.












Click it and Unblock the Notifications