ఏపీ వర్సెస్ తెలంగాణ: ఫైళ్లు తీసుకెళ్తుంటే అడ్డుకున్నారు (పిక్చర్స్)
విజయవాడ: ఏపీ బీసీ కార్యాలయంలోని దస్త్రాలను అమరావతికి తరలిస్తుండగా తెలంగాణ ఉద్యోగులు గురువారం నాడు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఉమ్మడి దస్త్రాలకు సంబంధించి నకలు ప్రతులు సిద్ధం చేయకుండా తీసుకెళ్ల వద్దని వారు ఆందోళనకు దిగారు. సంక్షేమ భవన్‌లోని ఏపీ విభాగాధిపతుల కార్యాలయాలను విజయవాడకు తరలించే ప్రక్రియలో భాగంగా వారం రోజులుగా ఏపీ బీసీ సంక్షేమ శాఖలోని కొన్ని పత్రాలను తీసుకు వెళ్లేందుకు సిబ్బంది ప్యాక్ చేశారు.
కొన్ని ఉమ్మడి రాష్ట్రానికి చెందిన దస్త్రాలు వాటిలో ఉన్నాయని, వీటి నకళ్లు సిద్ధం చేయకుండా ఏపీకి పట్టుకు వెళ్లవద్దని తెలంగాణ ఉద్యోగులు పట్టుబట్టారు.

ఏపీ వర్సెస్ తెలంగాణ
ఏపీ బీసీ కార్యాలయంలోని దస్త్రాలను అమరావతికి తరలిస్తుండగా తెలంగాణ ఉద్యోగులు గురువారం నాడు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఏపీ వర్సెస్ తెలంగాణ
ఉమ్మడి దస్త్రాలకు సంబంధించి నకలు ప్రతులు సిద్ధం చేయకుండా తీసుకెళ్ల వద్దని వారు ఆందోళనకు దిగారు. సంక్షేమ భవన్‌లోని ఏపీ విభాగాధిపతుల కార్యాలయాలను విజయవాడకు తరలించే ప్రక్రియలో భాగంగా వారం రోజులుగా ఏపీ బీసీ సంక్షేమ శాఖలోని కొన్ని పత్రాలను తీసుకు వెళ్లేందుకు సిబ్బంది ప్యాక్ చేశారు.

ఏపీ వర్సెస్ తెలంగాణ
కొన్ని ఉమ్మడి రాష్ట్రానికి చెందిన దస్త్రాలు వాటిలో ఉన్నాయని, వీటి నకళ్లు సిద్ధం చేయకుండా ఏపీకి పట్టుకు వెళ్లవద్దని తెలంగాణ ఉద్యోగులు పట్టుబట్టారు.

ఏపీ వర్సెస్ తెలంగాణ
మూడు నకళ్లు తీసుకొని ఒకటి ఏపీకి, మరొకటి తెలంగాణకు, ఇంకొకటి ఆర్కివ్స్‌లో పెట్టాలని తెలంగాణ ఉద్యోగులు డిమాండ్ చేశారు.

ఏపీ వర్సెస్ తెలంగాణ
దీంతో అక్కడ కాసేపు గందరగోళం ఏర్పడింది. ఇదే సమయంలో కొన్ని దస్త్రాలను తెలంగాణ ఉద్యోగులు పట్టుకెళ్లారు.

ఏపీ వర్సెస్ తెలంగాణ
ఈ ఘటన పైన ఏపీ గెజిటెడ్ అధికారుల ఫోరం అధ్యక్షులు పటేల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దస్త్రాల తరలింపు అడ్డుకోవడం సమంజసం కాదని, అభ్యంతరాలు ఉంటే ఉద్యోగులతో మాట్లాడి పరిష్కరించుకోవాలన్నారు.

ఏపీ వర్సెస్ తెలంగాణ
దీనిపై మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం మాట్లాడుతూ... హైదరాబాద్ నుంచి అమరావతికి 80 శాతం కార్యాలయాలు వచ్చాయని చెప్పారు. బీసీ సంక్షేమ శాఖకు చెందిన ఫైల్స్ సాఫ్ట్ కాపీని తెలంగాణకు ఇచ్చామని, చిన్న సాంకేతిక సమస్య వల్ల తెలంగాణ ఉద్యోగులు అడ్డుకున్నారన్నారు.

ఏపీ వర్సెస్ తెలంగాణ
సమస్యను పరిష్కరించి ఫైళ్లు తీసుకు వస్తామన్నారు. ఒకేచోట బీసీ కార్పోరేషన్, బీసీ ఫెడరేషన్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Click it and Unblock the Notifications