తలలు పగులగొట్టుకున్న మహేష్-పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మొత్తం తీసేయండి.. హోంమంత్రి

టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఇరువురి అభిమానులు తలలు బద్దలయ్యే దాకా కొట్టుకున్నారు. చొక్కులు చించుకున్నారు.

Recommended Video

    తలలు పగులగొట్టుకున్న మహేష్-పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

    కాకినాడ: టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఇరువురి అభిమానులు తలలు బద్దలయ్యే దాకా కొట్టుకున్నారు. చొక్కులు చించుకున్నారు.

    చదవండి: విమర్శకులకు చెంపపెట్టు, ఇదీ పవన్ కళ్యాణ్ అంటే: సుదీర్ఘ సమస్యపై మరో విక్టరీ

    మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ వివాదం

    మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ వివాదం

    ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరంలో జరిగింది. ఫ్లెక్సీ మధ్య వచ్చిన వివాదం మహేష్ - పవన్ అభిమానులు దాడులు చేసుకునే వరకు వెళ్లింది.

    తారాజువ్వలు కాల్చిన మహేష్ అభిమాని

    తారాజువ్వలు కాల్చిన మహేష్ అభిమాని

    గణేష్ నిమజ్జనం సందర్భంగా తారాజువ్వలు పేల్చుతారు. ఫ్యాన్స్ ఇరువురి బ్యానర్లు, ఫ్లెక్సీలు భారీగా కట్టారు. నిమజ్జనం సందర్భంగా మహేష్ బాబు అభిమాను తారాజువ్వలు కాల్చారు. ఇది ప్రమాదవశాత్తు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీకి తగిలి, అంటుకుంది.

    రాళ్లు రువ్వుకున్న ఫ్యాన్స్

    రాళ్లు రువ్వుకున్న ఫ్యాన్స్

    దీంతో పవన్ - మహేష్ బాబు అభిమానులు రాళ్లు రువ్వుకున్నారు. కావాలనే ఫ్లెక్సీని అంటించారని పవన్ ఫ్యాన్స్ ఆరోపించారు. ఆరుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తులను అమలాపురం ఆసుపత్రికి తరలించారు. ఫ్లెక్సీల కారణంగా జరిగిన వివాదాన్ని జిల్లా ఎస్పీ హోంమంత్రి చినరాజప్ప దృష్టికి తీసుకు వెళ్లారు.

    పవన్ - మహేష్ అభిమానులతో భేటీ

    పవన్ - మహేష్ అభిమానులతో భేటీ

    కోనసీమ వ్యాప్తంగా ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అమలాపురం డిఎస్పీ గ్రామంలో పర్యటించారు. ఘర్షణకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో పవన్ - మహేష్ బాబు అభిమానులతో మాట్లాడారు. శాంతియుతంగా ఉండాలని సూచించారు.

    సినిమాలు విడుదలైతే ఉద్రిక్తత

    సినిమాలు విడుదలైతే ఉద్రిక్తత

    ఈ ప్రాంతాల్లో పెద్ద హీరోల సినిమాలు విడుదలయ్యే సమయంలో ఉద్రిక్తత కనిపిస్తుంది. పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. అభిమానులకు కౌన్సెలింగ్ ఇస్తారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్‌లు స్నేహంగానే ఉంటారు. కానీ అభిమానులు మాత్రం గొడవపడుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+