బెజవాడలో కర్రలతో కొట్టుకున్న జగన్ పార్టీ కార్యకర్తలు

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఆ పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా పార్టీలోని రెండు వర్గాలు వేర్వేరుగా చేపట్టిన బైక్ ర్యాలీ ఈ వివాదానికి కారణమైంది.

ఒకే సమయంలో పార్టీ ఇంఛార్జులు ర్యాలీని ప్రారంభించారు. మెయిన్ రోడ్డులో ఇరువర్గాలు ఎదురయ్యాయి. ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిపై మరొకరు కర్రలతో దాడి చేసుకున్నారు. సమాచారం అందుకున్న సిఐ, ఎస్సైలు సిబ్బందితో వచ్చి ఇరువర్గాల వారిని చెదరగొట్టారు.

YSR Congress

కాగా, రాష్ట్ర విభజన ప్రక్రియను వ్యతిరేకిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల పదో తేదీన సీమాంధ్రలోని అన్ని జిల్లాల్లో విద్యార్థులు, యువతతో ర్యాలీ, 11న రైతులతో ట్రాక్టర్ల ర్యాలీ, 12న రహదారుల దిగ్బంధం, 14 నుంచి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో భారీ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు.

మరోవైపు వైయస్ జగన్ సమైక్యాంధ్ర కోసం వరుసగా జాతీయ పార్టీ నాయకులను కలుస్తున్న విషయం తెలిసిందే. మమతా బెనర్జీ, జయలలిత, కరుణానిధి, దేవేగౌడ, భారతీయ జనతా పార్టీ, సిపిఐ, సిపిఎం తదితర నేతలను కలిశారు. సోమవారం కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసును ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+