మెగా హీరో, మేనేజర్ మధ్య పవర్ ఫుల్ ఫైట్?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి చెందిన ఒక యంగ్ హీరో ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అతని వ్యక్తిగత జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైతే వాటి నుంచి బయటపడి ఈ సినిమా సూపర్ హిట్ తో తన స్టామినా నిరూపించుకున్నాడు. అతని సినిమా కెరీర్ లో ఇదే పెద్ద హిట్. ఈ జోష్ లోనే మరో మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. తాజాగా తన మేనేజర్ తో గొడవ పడినట్లు ఫిల్మ్ నగర్ లో వార్త గుప్పుమంది. సదరు హీరో, మేనేజర్.. ఇద్దరూ మంచి స్నేహితులు కావడం విశేషం. ఈగొడవలో ఇద్దరూ ఒకర్నొకరు భయంకరంగా తిట్టుకున్నట్లు సమాచారం.
ఈ హీరోకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన మూవీ ప్రమోషన్స్ తోపాటు దాని పబ్లిసిటీ వ్యవహారాలన్నింటినీ ఈ మేనేజరే దగ్గరుండి చూసుకున్నారు. అంతేకాకుండా ఆ హీరోకు పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిన సమయంలోనె వెన్నంటి ఉండి ధైర్యం చెప్పారు. వాస్తవానికి అతను సాఫ్ట్ వేర్ ఇంజనీర్. కాకపోతే ఈ హీరోకు క్లోజ్ ఫ్రెండ్. దీంతో అతని ఉద్యోగాన్ని మాన్పించి తనదగ్గరే ఉంచుకున్నాడు. వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. బాండింగ్ బాగుండేదని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలోనే షూటింగ్ జరుగుతున్న సెట్స్ లోనే వీరిద్దరి మధ్య గొడవ జరిగింది.

చలనచిత్ర పరిశ్రమలో సంబంధాలనేవి, బాండింగ్స్ అనేవి కేవలం తాత్కాలికమేనని మరోసారి నిరూపణ అయిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎంత మంచి సంబంధమైన ఒక్క సూపర్ హిట్ తో మారిపోతుందని, అప్పటివరకు తోడున్నవారు కానివారు అయిపోతారని వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి ఈ మెగా హీరో సినీ కెరీర్ లో ఇటీవల విడుదలైన ఈ సినిమానే మొదటి భారీ హిట్ అందుకున్న సినిమా. ఇద్దరి మధ్య ఎందుకు గొడవైందన్నది తెలియరాలేదు. మధ్యవర్తిత్వం చేయడానికి కూడా ఎవరూ ముందుకు రావడంలేదు. దాదాపు వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధానికి శుభం కార్డు పడినట్లేనంటున్నారు. ప్రస్తుతం ఆ హీరో ఎవరా? అనే చర్చ పరిశ్రమలో మొదలైంది.












Click it and Unblock the Notifications