Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ నియోజకవర్గంలో ఫలితం డిసైడ్ అయిపోయిందా...!!

ఏపీలో ప్రతీ నియోజకవర్గంలో ఎన్నికల పోరు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. పోలింగ్ కు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. మరో రెండు రోజులు మాత్రమే ప్రచారానికి సమయం ఉంది. దీంతో..పార్టీలు చివరి ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాయి. హోరా హోరీ పోరు కొనసాగుతున్న నియోజకవర్గాల్లో ఉత్కంఠ మరింత పెరుగుతోంది. సామాజిక సమీకరణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. టీడీపీ కంచుకోటలుగా భావిస్తున్న నియోజకవర్గాల్లో పోరు మరింత కీలకంగా మారుతోంది.

కొత్త లెక్కలు
కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ సారి పోరు నువ్వా నేనా అన్నట్లుగా మారుతోంది. వైసిపి అభ్యర్థిగా మంత్రి జోగి రమేష్‌..టిడిపి అభ్యర్థిగా బోడే ప్రసాద్‌ తోపాటు మరో తొమ్మిది మంది పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో వైసిపి, టిడిపి, కాంగ్రెస్‌ అభ్యర్థులు జోగి, బోడే, వెలిశెల మధ్య ఎన్నికల పోరు ఉత్కంఠగా సాగుతోంది. వైసిపి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి వైసిపిని వీడి టిడిపిలో చేరారు. ఆయన అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో వైసిపిని వీడి టిడిపిలో చేరారు. ఈ పరిస్థితుల్లో పెనమలూరు సీటును మంత్రి జోగి రమేష్‌కు వైసిపి కేటాయించింది. ఆయన ఈ నియోజకవర్గానికి కొత్త. పెడన నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన జోగి సీటును వైసిపి అధిష్టానం మార్పు చేసి పెనమలూరుకు పంపింది.

Close contest on Cards in Penamlauru between Jogi Ramesh and Bode Prasad Social Equations crucial

నువ్వా నేనా
ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ఆయన పెనమలూరు నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు. బోడేకు టిడిపి తొలుత టికెట్‌ నిరాకరించింది. తనకు టికెట్‌ కేటాయించకపోతే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతానని తెగేసి చెప్పారు. కొన్నిరోజులు టిడిపి జెండా లేకుండానే స్వతంత్రంగా ప్రచారం చేశారు. చివరికి సీటు దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి..నియోజకవర్గంలోనే అందుబాటులో ఉంటారనే పేరు..బలమైన కేడర్ బోడేకు కలిసొచ్చే అంశాలు. షెడ్యూల్ కు ముందే తనకు సీటు ఖాయమనే నమ్మకంతో ఎన్నికలకు బోడే కసరత్తు ప్రారంభించారు. కొత్త నియోజకవర్గం కావటంతో వైసీపీ అభ్యర్ది జోగి రమేష్ కు స్థానికంగా సర్దుబాట్లు సమయం తీసుకుంది.

ఎవరి ధీమా వారిదే
ఇద్దరు అభ్యర్దులకు ఇక్కడ గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. గత ఎన్నికల్లో ఓడిన బోడె ఈ సారి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. తన పైన నమ్మకంతో సీటు కేటాయించిన ముఖ్యమంత్రి జగన్ కు ఇక్కడ గెలిచి గిఫ్ఠ్ గా ఇస్తానని జోగి రమేష్ చెబుతున్నారు. స్థానికంగా ఉన్న సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. సంక్షేమ పథకాలతో పాటుగా పార్టీకి మద్దతుగా నిలుస్తున్న వర్గాలతో గెలుపు సాధ్యమేనని వైసీపీ అభ్యర్ది అంచనా వేస్తున్నారు. కానీ, టీడీపీ మాత్రం మూడు పార్టీల పొత్తు..ఓట్ల బదిలీ..ప్రభుత్వ వ్యతిరేకత పైన బోడే ఆశలు పెట్టుకున్నారు. దీంతో..ఇద్దరు అభ్యర్దులు హోరా హోరీగా మారుతున్న ఈ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎన్నిక జిల్లాలోనే ఉత్కంఠ పెంచుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+