ఎన్టీఆర్, సత్యనాదెళ్ల సామాన్య కుటుంబ వచ్చిన వారే: ప్రతిభా పురస్కారాల్లో చంద్రబాబు(ఫోటోలు)

అమరావతి: విద్యార్ధి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసేది పదో తరగతేనని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని పాఠశాల, ఇంటర్మీడియట్, సాంకేతిక, విశ్వవిద్యాలయాల్లో ప్రతిభ కనబర్చిన 6,362 మంది విద్యార్ధులకు ప్రతిభా పురస్కరాల ప్రదానోత్సవం తిరుపతి ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించడానికి ప్రతిభా పురస్కారాలు ఇస్తున్నామన్నారు. ఎంతో కీలకమైన పదో తరగతిలోనే లక్ష్యాలను నిర్దేశించుకునేలా, ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా భవిష్యత్తును తీర్చిదిద్దుకునేలా విద్యార్ధులను తయారు చేస్తామన్నారు.

పేదరికం విద్యకు అడ్డంగి కాబోదని పేర్కొన్నారు. ఎన్టీఆర్, మైక్రోసాఫ్ట్ అధినేత సత్యనాదెళ్ల లాంటి ఎందరో సామాన్య కుటుంబాల నుంచి వచ్చి ప్రపంచ స్థాయి వ్యక్తులుగా నిలిచారని పేర్కొన్నారు. పేదరికం పోవాలంటే విద్య ఒక్కటే మార్గమన్నారు. ఏపీలో ప్రపంచంలోని అత్యున్నత విశ్వవిద్యాలయాలను నెలకొల్పుతామన్నారు.

ఎన్టీఆర్, సత్యనాదెళ్ల సామాన్య కుటుంబ వచ్చిన వారే

ఎన్టీఆర్, సత్యనాదెళ్ల సామాన్య కుటుంబ వచ్చిన వారే

అంతక ముందు తిరుపతిలో రెండురోజులుగా జరుగుతున్న జన చైతన్య యాత్ర సన్నాహక సదస్సు శనివారంతో ముగిసింది. రెండు రోజుల సదస్సులో పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. నేతల తమ విధానం మార్చుకోకుంటే తలెత్తే ఇబ్బందులను వివరించారు.

ఎన్టీఆర్, సత్యనాదెళ్ల సామాన్య కుటుంబ వచ్చిన వారే

ఎన్టీఆర్, సత్యనాదెళ్ల సామాన్య కుటుంబ వచ్చిన వారే

కార్యకర్తలను గౌరవించి పార్టీని పటిష్టం చేయాలన్నారు. పార్టీ బలోపేతానికి ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో నాయకులు చెబుతూనే, అధికారులు అనుసరిస్తోన్న నిర్లక్ష్య ధోరణిపై ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది.

 ఎన్టీఆర్, సత్యనాదెళ్ల సామాన్య కుటుంబ వచ్చిన వారే

ఎన్టీఆర్, సత్యనాదెళ్ల సామాన్య కుటుంబ వచ్చిన వారే

అలాగే, అమరావతిపైనే దృష్టి సారిస్తున్నారన్న అపవాదు పెరుగుతోందని బాబు దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. నామినెటెడ్ పదవుల ప్రస్తావన వచ్చినపుడు, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని బాబు హామీ ఇచ్చారని తెలుస్తోంది.

 ఎన్టీఆర్, సత్యనాదెళ్ల సామాన్య కుటుంబ వచ్చిన వారే

ఎన్టీఆర్, సత్యనాదెళ్ల సామాన్య కుటుంబ వచ్చిన వారే

రెండు రోజుల పాటు జరిగిన జన చైతన్య యాత్ర సన్నాహక సదస్సుకు మీడియాను అనుమతించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో ఏపి సంక్షోభంలో పడినప్పటికీ, అధిగమించేందుకు ప్రత్యేక విజన్‌తో ముందుకెళ్తున్నామన్నారు.

 ఎన్టీఆర్, సత్యనాదెళ్ల సామాన్య కుటుంబ వచ్చిన వారే

ఎన్టీఆర్, సత్యనాదెళ్ల సామాన్య కుటుంబ వచ్చిన వారే

రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అయితే సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా పార్టీ యంత్రాంగం పనిచేయాలన్నారు. నేతలు క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సమన్వయం చేసుకోవాలన్నారు.

ఎన్టీఆర్, సత్యనాదెళ్ల సామాన్య కుటుంబ వచ్చిన వారే

ఎన్టీఆర్, సత్యనాదెళ్ల సామాన్య కుటుంబ వచ్చిన వారే

తాను ఇటు సిఎంగా ప్రభుత్వాన్ని, అధ్యక్షుడిగా పార్టీని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నానన్నారు. మనపై నమ్మకంతో ప్రజాసేవకు అవకాశం ఇచ్చారని, అది విస్మరిస్తే చేదు అనుభవాలు తప్పవని శ్రేణులను హెచ్చరించారు.

 ఎన్టీఆర్, సత్యనాదెళ్ల సామాన్య కుటుంబ వచ్చిన వారే

ఎన్టీఆర్, సత్యనాదెళ్ల సామాన్య కుటుంబ వచ్చిన వారే

వైద్య ఆరోగ్య, రెవెన్యూ శాఖలను ప్రక్షాళన చేస్తామన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య పథకం ద్వారా 2 నుండి 2.5 లక్షల వరకూ వైద్య భరోసా ఇస్తున్నామన్నారు. రెవెన్యూ రికార్డులను ఆధునీకరించి, దేశంలోనే రెవెన్యూ రికార్డులను ఆన్‌లైన్ చేసిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రను తీర్చిదిద్దుతామన్నారు.

 ఎన్టీఆర్, సత్యనాదెళ్ల సామాన్య కుటుంబ వచ్చిన వారే

ఎన్టీఆర్, సత్యనాదెళ్ల సామాన్య కుటుంబ వచ్చిన వారే

చౌకదుకాణాల్లో ఈ-పాస్ విధానం తీసుకొచ్చి అవినీతి ప్రక్షాళన చేశానన్నారు. ప్రస్తుత ఇసుక పాలసీ ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదన్నారు. త్వరలోనే ఇసుక మాఫియా ఆట కట్టించేందుకు ప్రజాభిప్రాయంతో కొత్త విధానం తెస్తామన్నారు.

 ఎన్టీఆర్, సత్యనాదెళ్ల సామాన్య కుటుంబ వచ్చిన వారే

ఎన్టీఆర్, సత్యనాదెళ్ల సామాన్య కుటుంబ వచ్చిన వారే

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి 9వేల కోట్లు కేటాయించామన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసి రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలను కరవునుంచి శాశ్వతంగా దూరం చేస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+