ఏం చేస్తున్నారు, ఇక సిద్దంగా ఉండండి - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు కీలక దిశా నిర్దేశం చేసారు. బెదిరింపు రాజకీయాలను తిప్పి కొట్టాలని సూచించారు. కేబినెట్ అజెండాతో సహా ప్రభుత్వంలోని కీలక అంశాలు నిర్ణయాల కు ముందే బయటకు వెళ్లటం పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల పైనా మంత్రులను సిద్దంగా ఉండాలని సూచించారు. సమాచారం లీక్ అయితే ఎన్టీఆర్ కేబినెట్ రద్దు చేసిన అంశాన్ని ప్రస్తావించారు. ఇదే సమయంలో అధికారుల తీరును తప్పు బట్టిన సీఎం.. కీలక ఆదేశాలు జారీ చేసారు.

ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అధికారిక అజెండా పూర్తయిన తరువాత వివిధ అంశాలపై మంత్రులతో సీఎం చర్చించారు. కేబినెట్ సమావేశం ప్రారంభమైనా అజెండా మంత్రులకు రాలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తావించారు. అజెండా ముందే వస్తే స్టడీ చేసుకుని కేబినెట్‌కు వచ్చే వీలు ఉండేదన్నారు. దీంతో కార్యదర్శుల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవస్థలు రాను రాను మరింత ఉపయోగపడాల్సింది పోయి క్లిష్టంగా మారుతున్నాయంటూ అధికారుల తీరను ముఖ్యమంత్రి తప్పుబట్టారు. గతంలో కార్యదర్శులు సబ్జెక్టుల్లో భాగస్వాములవుతూ చర్చల్లో ఏ సందేహం వచ్చినా పూర్తిగా నివృత్తి చేసేందుకు చొరవ చూపేవారని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ఇప్పుడా పరిస్థితి లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

cm-chandra-babu-angry-over-some-of-the-ministers-in-cabinet-meeting-key-discussion-on-up-coming-mu

మంత్రులకు మార్గనిర్దేశం

డీమ్డ్ యూనివర్సిటీలను రాష్ట్రంలో ఎక్కువ ప్రమోట్ చేయాలని సీఎం ఆదేశించారు. 10 ఎకరాలు తక్కువ కాకుండా నిబంధనలు పెట్టి నాణ్యత పెంచుతూ ఎక్కువ సంఖ్యలో డీమ్డ్ యూనివర్సిటీ లను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో తక్కువ డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయని సీఎం తెలిపారు. జలధార, సూర్యఘర్, పీఎం కుసుమ్, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను మంత్రులు ఓనర్ షిప్ తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రతి మంత్రి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి సంబంధించి నాలుగు కార్యక్రమాల్లో అయినా పాల్గొనాలని ఆదేశించారు. కూటమి ఎమ్మెల్యేలూ ఇదే అనుసరించాలని నిర్దేశించారు. జలధారకు ఉపాధి హామీ నిధులు అనుసంధానం అయ్యేలా పనులు చేపట్టాలని సీఎం నిర్దేశించారు. సూర్యఘర్, పీఎం కుసుమ్‌ కింద వీలైనన్ని ఎక్కువ కనెక్షన్లు ఇచ్చేలా కార్యాచరణ ఉండాలన్నారు. గ్రామాలను శుభ్రంగా ఉంచుకుంటూ వ్యాధుల నివారణకు కృషి చేసేలా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందని.. 2011 జానాభా లెక్కల ప్రాతిపదికనే ఎన్నికలు జరుగుతాయని సమావేశంలో చర్చించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+