విశాఖ కేంద్రంగా చంద్రబాబు కీలక ప్రకటన..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ కేంద్రంగా కీలక ప్రకటన చేసారు. నాలెడ్జ్ ఎకానమీకి విశాఖ పట్నం ఫ్యూచర్ సిటీగా నిలిపేందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. విశాఖ బెస్ట్ సిటీస్ లో ఒకటిగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. టెక్నాలజీని సమర్ధవంతంగా వినియోగిస్తే ఉపాధి తో పాటుగా పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. నాలెడ్జ్, ఎకానమీలో యువత కీలకంగా మారారని పేర్కొన్న చంద్రబాబు.. ఏపీ నాలెడ్జ్ హబ్ గా మారుతుందని వెల్లడించారు.
విశాఖలో జరుగుతున్న డీప్ టెక్నాలజీ సదస్సు-2024 ముఖ్యమంత్రి చంద్రబాబు టెక్నాలజీ వినియోగం పైన కీలక అంశాలు ప్రస్తావించారు. విజన్ -2047 లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని వివరించారు. మన జీవితంలో సాంకేతికత అనేది ఒక భాగంగా మారిందని సీఎం వ్యాఖ్యానించారు.
సాంకేతికతలో అనేక నూతన మార్పులు వచ్చాయని వివరించారు. విశాఖ గురించి చంద్రబాబు ప్రతేకంగా ప్రస్తావించారు. విశాఖ నాలెడ్జ్ ఎకానమీకి ఫ్యూచర్ సిటీగా నిలుస్తుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ నిపుణుల్లో 30 శాతం తెలుగువారేనని చెప్పుకొచ్చారు.

తొలి సారి సీఎం అయిన తరువాత హైదరాబాద్ లో నాడు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఐటీకి డెస్టినేషన్ గా మార్చామని చెప్పారు. డీప్ టెక్నాలజీ సరికొత్త ఆవిష్కరణ పైన ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. ఈ టెక్నాలజీని అందుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం ఏఐ ఆధారిత సేవలకు ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. ఏపీని నాలెడ్జ్ హబ్ గా తీర్చి దిద్దే క్రమంలో అమరావతి కేంద్రంగా ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు అడుగులు వేస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం 4పీ విధానంలో ముందుకు వెళ్తున్నామని వివరించారు. టూరిజం సెక్టార్ లోనూ కొత్త విధానాలు తెచ్చేలా ప్రణాళిక లు సిద్దం అవుతున్నాయని చంద్రబాబు వెల్లడించారు.












Click it and Unblock the Notifications