ఖబడ్దార్, జాగ్రత్తగా ఉండండి - చంద్రబాబు మాస్ వార్నింగ్..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. పల్నాడు వైసీపీ నేతలను ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండాలంటూ చంద్రబాబు హెచ్చరించారు. రౌడీయిజం, నేరాలు, ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలపై వైసీపీ నేతలు దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చ రించారు. ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడదామని పిలుపునిచ్చారు. చెత్త పన్ను తొలగించడం తోపాటు చెత్త రాజకీయాలనూ క్లీన్‌ చేస్తామని తెలిపారు. పల్నాడులో రౌడీయిజాన్ని అణచివేస్తానని చెప్పుకొచ్చారు. చెత్తనే కాదు.. చెత్త రాజకీయాలను కూడా తొలగిస్తానని తెలిపారు.

మాచర్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాల గురించి చంద్రబాబు వివరించారు. ఒకింట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా 'తల్లికి వందనం' అందిస్తున్నామన్నారు. స్త్రీశక్తి పథకం కింద ఆడబిడ్డలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని తెలిపారు. మహిళలకు మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని గుర్తు చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు రూ.20 వేల చొప్పున ఇస్తున్నామని వివరించారు. ఒక్క పైసా అవినీతి లేకుండా 16,347 మందికి టీచర్‌ ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు రూ.15 వేల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

cm-chandra-babu-announces-more-whats-app-services-will-launch-soon

జీఎస్టీ సంస్కరణల వల్ల పన్నుల భారం తగ్గిందని, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిందని సీఎం అన్నారు. ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాట్సప్ ద్వారానే ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఆరోగ్య రంగంలో పెద్ద ఎత్తున మార్పులు తెస్తామని చంద్రబాబు ప్రకటించారు. సంజీవని ప్రాజెక్టు ప్రారంభించనున్నట్లు తెలిపారు. యూనివర్సల్ హెల్త్ పథకం కింద ధనిక, పేద తేడా లేకుండా అందరికీ రూ.2.5 లక్షల బీమా కల్పించనున్నట్లు చెప్పారు.

ఎన్టీఆర్ వైద్యసేవ కింద పేదలకు రూ.25 లక్షల వరకు వైద్య సహాయం అందిస్తామని ప్రకటించారు. 2047 నాటికి రాష్ట్రంలో 50% పచ్చదనం సాధించడమే లక్ష్యమని, ప్రతి కుటుంబం ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. పారిశుద్ధ్య కార్మికులకు రూ.1 కోటి బీమా అందిస్తున్నట్లు ప్రకటించారు. మాచర్లను మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని సీఎం హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+