విశాఖ స్టీల్ ప్లాంట్ పై తేల్చేసిన చంద్రబాబు - కార్మికులకు అలర్ట్..!!
విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం ముదురుతోంది. ప్రయివేటీకరణ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇప్పటికే కార్మికులు ఆందోళనకు దిగారు. రాజకీయ పార్టీల పైన ఒత్తిడి పెరుగుతోంది. అటు కేంద్రం స్టీల్ ప్లాంట్ ఆర్దిక నిర్వహణ పైన కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు స్టీల్ ప్లాంట్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. కార్మికులకు పలు అంశాలను సూచించారు.
ప్లాంట్ ను కాపాడుకుందా
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రెచ్చగొడుతున్నారని ప్రతిపక్ష నాయకులపై ఆయన మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. గతంలో కూడా ఇలాంటి సందర్భం వస్తే మేమే అడ్డుకున్నామని గుర్తు చేశారు. తాను కేంద్రం మంత్రి కుమార స్వామితో మాట్లాడానని, కొంత డబ్బు ఇచ్చి ప్లాంట్ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారని చంద్రబాబు వెల్లడించారు.

కార్మికులకు సూచనల
స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో బాధ్యతగా వ్యవహరిస్తామన్నారు చంద్రబాబు. ప్లాంట్ ను ఎలా కాపాడుకోగలమో అలా కాపాడుకుంటామన్నారు. ఎన్డీయే కూటమికి విశాఖ చాలా ముఖ్యమైన నగరం అని చంద్రబాబు చెప్పారు. కార్మికులు, యూనియన్ల నేతలకు చంద్రబాబు కీలక సూచనలు చేసారు. ల కోట్ల రూపాయలు చారిటీగా ఇచ్చి ఎవరూ బెయిల్ ఔట్ చేయలేరన్నారు. అందరం కలిసి ముందుకెళ్లాలని సూచించారు. కార్మిక నేతలు గుర్తించాలిని కోరారు. ఆంధ్రుల హక్కు - విశాఖ ఉక్కు అనే నినాదం ఎప్పటికీ నిలిచిపోయేలా ప్లాంట్ ను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
సెంటిమెంట్ ప్రతీసారి
అదే సమయంలో సెంటిమెంట్ ప్రతీసారి వర్కవుట్ అవదని వ్యాఖ్యానించారు. ప్లాంట్ లో ఉత్పత్తి పెరిగి..ఇతర ప్లాంట్ల కంటే మెరుగైన స్థానంలో నిలిపేందుకు కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. తాను ఇప్పటికే కేంద్రమంత్రులతో మాట్లాడానని చెప్పుకొచ్చారు. ప్లాంట్ కు కావాల్సిన నిధులను కొంత మేర విడుదల అవుతాయన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ లాభాల బాట పట్టేలా అందరం కలిసి పని చేద్దామని ముఖ్యమంత్రి సూచించారు.












Click it and Unblock the Notifications