హుటాహుటిన హైదరాబాద్ కు చంద్రబాబు - ఆందోళన..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దయింది. ఢిల్లీలో ఉన్న చంద్రబాబు తన సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమంగా ఉండటంతో హుటాహుటిన తిరిగి హైదరాబాద్ కు వస్తున్నారు. ఈ రోజు మహారాష్ట్రకు వెళ్లి అక్కడ చంద్రబాబు రెండు రోజులు బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసేలా షెడ్యూల్ ఖారారైంది. అయితే, సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం అత్యంత విషమంగా ఉండటంతో చంద్రబాబు వెంటనే హైదరాబాద్ కు చేరుకుంటున్నారు.

సీఎం చంద్రబాబు తన సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమించటంతో ఆందోళనలో ఉన్నారు. ఢిల్లీలో ఒక మీడియా సంస్థ నిర్వహిస్తున్న సదస్సు లో పాల్గొన్న తరువాత చంద్రబాబు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లాల్సి ఉంది. ఇప్పటికే ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు చేసారు. మహారాష్ట్ర సీఎం షిండేతోనూ సమావేశం కావాల్సి ఉంది. అయితే, ఢిల్లీలో ఉన్న చంద్రబాబుకు తన సోదరుడు ఆరోగ్యం విషమంగా ఉందనే సమాచారంతో తన మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్నారు. మీడియా సంస్థ సదస్సులో పాల్గొన్న తరువాత హైదరాబాద్ కు చేరుకొని ఆస్పత్రిలో తన సోదరుడి వద్దకు వెళ్లనున్నారు.

CM Chandra Babu Cancel his Maharashtra Tour return to Hyderabad due to his brother critical condition

చంద్రబాబు సోదరుడు అనారోగ్యంతో రామ్మూర్తి నాయుడు కొంత కాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదయమే హైదరాబాద్ లోని ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి పై సీఎం చంద్రబాబు ఆరా తీసారు. తన చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మంత్రి నారా లోకేశ్‌ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని హుటాహుటిన హైదరాబాద్‌ చేరుకుంటున్నారు. రామ్మూర్తి నాయుడు నారా కర్జూరనాయుడు, అమ్మన్నమ దంపతుల రెండో కుమారుడు. ఆయనకు ఇద్దరు పిల్లలు. వారిలో ఒకరు నటుడు రోహిత్ కాగా, రెండో కుమారుడు గిరీష్. రామ్మూర్తి నాయుడు 1994 లో చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

కొంత కాలానికి అనారోగ్య కారణాలతో రామ్మూర్తి నాయుడు రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆయన కుమారుడు రోహిత్ వివాహ నిశ్చితార్దం జరిగింది. మంత్రి లోకేష్ తన చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి పై వైద్యులతో మాట్లాడారు. మరి కాసేపట్లో చంద్రబాబు హైదరాబాద్ చేరకున్న తరువాత ఆస్పత్రిలో సోదరుడిని పరామర్శించి వైద్యులతో మాట్లాడనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+