జగన్‌కు దొరికింది అదొక్కటే, అయినా.. నో ఛాన్స్ - చంద్రబాబు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ సీఎం జగన్ పై కీలక వ్యాఖ్యలు చేసారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. తాజా పరిణామాల పైన చర్చించారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన.. కావాల్సిన సాయం పైన నిర్దేశించారు. ఏపీకి దక్కాల్సిన ప్రయోజ నాల పైన ఎంపీలు కేంద్రంతో సంప్రదింపులు చేస్తూ.. దక్కేలా చూడాలని నిర్దేశించారు. ఇదే సమయంలో ఏపీలో వైసీపీ రాజకీయ నిర్ణయాలు.. జగన్ తాజా వ్యాఖ్యల పైన స్పందించిన సీఎం చంద్రబాబు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు.
ఏపీ రాజకీయాల్లో మెడికల్ కాలేజీల వ్యవహారం కీలకంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం ఏపీలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో పూర్తి చేస్తామని ప్రకటించింది. దీనిని వ్యతిరేకిస్తున్న వైసీపీ నిరసనలు కొనసాగిస్తోంది. తాజాగా కోటీ సంతకాలతో మాజీ సీఎం జగన్ రాష్ట్ర గవర్నర్ ను కలిసి తమ అభ్యంతరాలను వ్యక్తం చేసారు. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ ఆపేవరకు పోరాటం తాము కొనసాగిస్తామని స్పష్టం చేసారు. కాగా.. ఢిల్లీ లో పార్టీ ఎంపీలతో సమావేశమైన చంద్రబాబు ఇదే అంశం పైన స్పందించారు. రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాల విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎక్కువ ఎదురుదెబ్బలే తగులుతున్నాయని చెప్పారు. ఒక్క వైద్య కళాశాలలు పీపీపీ వ్యవహారం మాత్రమే వాళ్లకి దొరికిందని తెలిపారు.

కాగా, ఆ విషయంలో కూడా ప్రజలు వాళ్లకి అవకాశం ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. కోటి సంతకాల పేరుతో డ్రామా చేయాలని చూశారని.. అది కూడా విఫలమే అయ్యిందని తెలిపారు. ఢిల్లీ స్థాయిలో కూడా పీపీపీ విధానంపై అధ్యయనం చేయాలని ఎంపీలను సీఎం కోరారు. ప్రస్తుతం ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో పీపీపీ పద్ధతిలో ఆసుపత్రులు నడుస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రికి పలువురు ఎంపీలు వివరించారు. 'మనకి గుర్తింపు పెరుగుతున్న కొద్దీ మనపై బాధ్యత ఎక్కువ అవుతుంది' అని తెలిపారు.
రాష్ట్రంలో ఇంకా బాధ్యతగా పని చేయాల్సిన అవసరం ఉందని ఎంపీల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పలువురు కేంద్ర మంత్రులతోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. సాస్కీ కింద రెండో విడత రూ.10,054 కోట్ల నిధులు మంజూరు చేయాలని, మౌలిక సదుపాయాల నిర్మాణానికి నిధులు కీలకమని చెప్పారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు రూ.41 వేల కోట్ల ఆర్థిక సహకారం అవసరమని కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ముఖ్యమంత్రి కోరారు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications