మంత్రులకు ర్యాంకుల వెనుక - చంద్రబాబు అసలు లక్ష్యం..!!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో వారి పని తీరు.. ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా వీటిని ఖరారు చేసారు. వాటిల్లో 6వ స్థానంలో తాను ఉన్నానని, 8వ ర్యాంకు లోకేష్ కు ఇవ్వగా.. డిప్యూటీ సీఎం పవన్ కు 10వ ర్యాంకు దక్కింది. ఈ ర్యాంకుల ఖరారు పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. పవన్ కు10వ ర్యాంకు పైన చర్చ మొదలైంది. వైసీపీ నేతలు సైతం ఈ ర్యాంకుల పైన సెటైరికల్ గా స్పందించారు. దీంతో, చంద్రబాబు స్పందించారు. ర్యాంకుల ప్రకటన వెనుక తన లక్ష్యాల పై స్పష్టత ఇచ్చారు.
ర్యాంకుల వెనుక
ఏపీ మంత్రులకు తాజాగా సీఎం చంద్రబాబు ర్యాంకులు ప్రకటించారు. ఎనిమిది నెలల కాలంలో వారి పని తీరు ఆధారంగా వీటిని ఖరారు చేసారు. అయితే, ఈ ర్యాంకుల విషయం పైన కూటమి లో చర్చ జరిగింది. భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో, ఈ ర్యాంకుల కేటాయింపు పైన సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. ఎవరినీ ఎక్కువ చేయటానికో.. తక్కువకో కాదని స్పష్టం చేసారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసారు. అందులో.." ప్రజలు అపారమైన నమ్మకంతో 2024 ఎన్నికల్లో 93 స్ట్రైక్ రేట్ తో చారిత్రాత్మక తీర్పును ఇచ్చి గెలిపించారని గుర్తు చేసారు. వారి ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు తొలిరోజు, తొలిగంట నుంచి ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

ఇందుకోసమే ప్రయత్నం
గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు శాయశక్తులా కష్టపడు తున్నామన్నారు. సంక్షేమం అమలు చేస్తూనే...మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల సాధనతో అభివృద్దివైపు అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని సుపరిపాలనతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని.. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ లక్ష్యాలను వేగంగా చేరుకోవాలంటే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడాలి. టీమ్ వర్క్‌గా పని చేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలమని నేను విశ్వసిస్తాను. అసాధారణ, వేగవంతమైన పనితీరు చూపితే తప్ప...విధ్వంస రాష్ట్రంలో పునర్నిర్మాణ ఫలితాలను ప్రజలకు చూపలేమని వివరించారు. అందుకే ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు టీం స్పిరిట్ తో పనితీరుపై సమీక్షించుకుని పనిచేయాలన్నదే తన ఆలోచనగా చెప్పారు.
ప్రజలు అపారమైన నమ్మకంతో 2024 ఎన్నికల్లో 93 స్ట్రైక్ రేట్ తో చారిత్రాత్మక తీర్పును ఇచ్చి గెలిపించారు. వారి ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు తొలిరోజు, తొలిగంట నుంచి ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు శాయశక్తులా కష్టపడుతున్నాం.… pic.twitter.com/sRpCrO9Xdy
— N Chandrababu Naidu (@ncbn) February 7, 2025
ఆ ఉద్దేశం లేదు
అందులో భాగంగానే ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చాం. దస్త్రాల పరిష్కారంలో నిన్న విడుదల చేసిన ర్యాంకులు ఎవరినీ ఎక్కువ చేయడానికి కాదు.. ఎవరినీ తక్కువ చేయడా నికి కాదని స్పష్టం చేసారు. ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడం ద్వారా తమతో తాము పోటీ పడటంతో పాటు, ఒకరితో ఒకరు పోటీ పడి పనిచేయడానికి, పాలనలో వేగం పెంచేందుకు చేసిన ప్రయత్నమే ఇది. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో నేను కూడా నా స్థానాన్ని మరింత మెరుగుపరుచుకో వాల్సి ఉందని పేర్కొన్నారు. 'పీపుల్ ఫస్ట్' విధానంతో నేను, నా కేబినెట్ సహచర మంత్రులంతా పనిచేస్తున్నాము. లక్ష్యాల సాధనకు అడుగులు వేస్తున్నాము. గ్రామ స్థాయిలో చిరు ఉద్యోగి నుంచి సీఎం వరకు అంతా కష్టపడి సమిష్టిగా పనిచేస్తేనే ప్రజల సమస్యలు, కష్టాలు తీర్చి... సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టగలం. ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో శాఖల్లో అత్యున్నత ప్రతిభ చూపిస్తారని ఆశిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications