ముఖ్య నేతలకు చంద్రబాబు పిలుపు - కీలక నిర్ణయం, ఇక..!!

ఏపీలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఎమ్మెల్యేల వివాదాల పైన ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇలాంటి వివాదాలు మరోసారి చోటు చేసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యేల బాధ్యతలను ఇంఛార్జ్ మంత్రులకు అప్పగించారు. ఇదే సమయంలో పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు కీలక సమావేశం ఏర్పాటు చేసారు. పార్టీ - పాలనా పరంగా చర్చలు.. కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అనంతపురం వేదికగా భారీ సభ నిర్వహణ పైన నిర్ణయించారు.

సీఎం చంద్రబాబు రేపు (శనివారం) కీలక భేటీకి నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, పొలిట్‌ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. టీడీపీ సంస్థాగత నిర్మాణంపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. అసెంబ్లీ, పార్లమెంట్ కమిటీల ఏర్పాటుపై చర్చించనున్న సీఎం చంద్రబాబు..వెంటనే పూర్తి చేసేలా సూచనలు చేయనున్నారు. మొత్తం 25 లోక్ సభ స్థానాలకు పార్టీ అధ్యక్షుల ఎంపిక కోసం ఈ నె 24,25,26 తేదీల్లో ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున సమన్వయ కర్తలు వెళ్లనున్నారు. స్థానికంగా పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలతో చర్చించి గరిష్టంగా ముగ్గురిని ఎంపిక చేసి వారి పేర్లను పార్టీకి ఇవ్వనున్నారు. అందులో ఒకరిని పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించనున్నారు.

cm-chandra-babu-crucial-meeting-with-party-main-leaders-details-here

ఈ ఎన్నికకు సంబంధించిన విధి విధానాలను పార్టీ ముఖ్య నేతలతో ఈ భేటీలో చంద్రబాబు ఫైనల్ చేయనున్నారు. ఈ సమావేశంలోనే స్త్రీశక్తి పథకం విజయవంతంపై జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న సమావేశాలపైనా చర్చిస్తారు. సెప్టెంబరు 3న అనంతపురంలో సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌ పేరుతో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభపై కూడా చర్చించనున్నారు.

వాస్తవానికి ఈ సభను ఈ నెల 25న నిర్వహించాలని భావించారు. అయితే, మధ్యలో ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ఢిల్లీ పర్యటన కారణంగా వాయిదా పడింది. ఇక.. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేల విషయంలోనూ సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. వీరిని నియంత్రించే బాధ్యత జిల్లా ఇంఛార్జ్ మంత్రులకు అప్పగించారు. రేపు జరిగే భేటీలో మరోసారి మంత్రులకు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పర్యవేక్షణ పైన చంద్రబాబు స్పష్టత ఇవ్వనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+