రాజధానిలో ఆ భూముల మినహాయింపుల పై చంద్రబాబు కీలక ఆదేశాలు..!!

రాజధాని అమరావతి కేంద్రంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. నిర్మాణాల విషయం లో ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తోంది. కొత్తగా విమానాశ్రయం కోసం భూ సమీకరణ పైన తాజా గా కసరత్తు ప్రారంభించారు. ఇదే సమయంలో రైతులకు ఇచ్చిన హామీల అమలు దిశగా సీఆర్డీఏ గ్రామాల వారీగా చర్యలు తీసుకుంటోంది. కాగా.. గ్రామకంఠాల విషయంలో తెర మీదకు వచ్చిన అంశాల పైన తాజాగా సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు.

అమరావతిలో భూ సమీకరణ సమయంలో పలు గ్రామాలను, వాటిని ఆనుకుని ఉన్న పశువుల కొట్టాలను గ్రామకంఠాల కింద పరిగణించి.. భూసమీకరణ నుంచి మినహాయించారు. అయితే.. తమ భూములను కూడా గ్రామకంఠాల కింద పరిగణించి.. భూసమీకరణ నుంచి మినహాయింపు కోసం పలువురు రైతులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు సీఆర్డీఏ రూపొందించి న నిబంధనలను అనుసరించి.. ప్రభుత్వం కొంతమంది రైతుల భూముల మినహాయింపునకు అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఆర్డీఏ రూపొందించిన నిబంధనలకు విరుద్ధంగా రైతుల భూములను మినహాయింపు చేశారని కొన్ని గ్రామాల వారు మంత్రి నారాయణకు ఫిర్యాదు చేశారు. గ్రామకంఠాల మినహాయింపులలో జరిగిన అవకతవకలపై మంత్రి నారాయణ ముఖ్యమంత్రితో చర్చించిన అనంతరం.. చంద్రబాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమరావతి గ్రామకంఠాల మినహాయింపులను పునః పరిశీలించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

 Amaravati ORR రూట్ ఇలా: 23 మండలాలు, 121 గ్రామాలు- గేమ్ ఛేంజర్..!!
Amaravati ORR రూట్ ఇలా: 23 మండలాలు, 121 గ్రామాలు- గేమ్ ఛేంజర్..!!
cm-chandra-babu-directs-officials-to-re-examine-gramakantham-area-exemptions-details-here

స్పష్టత ఇచ్చిన మంత్రి నారాయణ

కాగా.. మినహాయింపులు నిబంధనలకు అనుగుణంగా జరిగాయా లేదా అన్న అంశాన్ని లోతుగా పరిశీలించి.. సీఆర్డీఏకు నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇక.. కొందరు అమరావతిపై పనిగట్టుకుని దుష్ప్రచారం సాగిస్తున్నారని మంత్రి పొంగూరు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలో పనులు పూర్తయితే చుక్కా నీరు నిలబడే అవకాశం లేదని చెప్పారు. నెదర్లాండ్‌ టెక్నాలజీని రాజధాని నిర్మాణంలో వినియోగిస్తున్నాం. కొండవీటి వాగు, పాలవాగు గ్రావిటీ కెనాల్స్‌ అభివృద్ధితో రాజధాని ప్రాంతంలో చుక్క నీరు నిలిచే పరిస్థితి లేదు. 22 వేల క్యూసెక్కుల నీటిని బయటికి పంపించే విధంగా కాలువల నిర్మాణం జరిగిందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మరో వైపు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం పైన NHAI టెండర్లు ఆహ్వానించింది. ఓఆర్ఆర్ పరిధిని ఖరారు చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+