Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఢిల్లీ ఫలితంతో చంద్రబాబు నిర్ణయంలో మార్పు..!?

Delhi Assembly Election Results 2025: ఢిల్లీలో బీజేపీ అధికారం దక్కించుకుంది. 27 ఏళ్ల తరువాత తిరిగి ఢిల్లీ పగ్గాలు దక్కాయి. ఆప్ ముఖ్య నేతలకు ఓటర్లు షాక్ ఇచ్చారు. కేజ్రీవాల్ తో సహా ముఖ్య నేతలు ఓటమి బాట పట్టారు. కాంగ్రెస్ నామ మాత్రపు పోటీ కూడా ఇవ్వలేదు. ఇదే సమయంలో బీజేపీకి వరుసగా దక్కుతున్న విజయాలతో కొత్త జోష్ కనిపిస్తోంది. ఎన్డీఏ భాగస్వామి పక్ష నేత ఏపీ సీఎం చంద్రబాబు ఈ ఫలితాల పైన ఆసక్తి కర విశ్లేషణ చేసారు. ఏపీతో పోల్చుతూ ఓటర్ల మూడ్ వివరించారు. కీలక అంశాలను ప్రస్తావించారు.

మోదీ పై ప్రశంసలు
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు పైన సీఎం చంద్రబాబు స్పందించారు. లీడర్ కరెక్ట్ గా ఉంటే అభివృద్ధి సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. ఢిల్లీ లో బీజేపీ విజయం చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతదేశం అని చెప్పుకోవడం గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. ఢిల్లీ లో వాయు కాలుష్యం.. రాజకీయ కాలుష్యం ఎక్కువగా ఉందని చంద్రబాబు విశ్లేషించారు. ఒక్కోసారి పరిస్థితి తారుమారు అవుతుందని వ్యాఖ్యానించారు. ఇందుకు ఉదాహరణ ఢిల్లీ ఫలితాలు నిలుస్తాయన్నారు. ప్రధాని మోడీ పైన నమ్మకం తోనే ఢిల్లీ ఓటర్లు బీజేపీకి పట్టం కట్టారని వివరించారు.

CM Chandra Babu interesting analysis over Delhi Election Results praises PM Modi leadership

ఢిల్లీలో అలా .. ఏపీలో ఇలా
మోదీ నాయకత్వాన్ని ప్రశంసించిన చంద్రబాబు.. సరైన సమయంలో సరైన నేత నాయకత్వం దేశానికి దక్కిందని పేర్కొన్నారు. సంక్షేమం ఇస్తున్నామని మాయ మాటలు చెబుతున్నారని.. బటన్ నొక్కుతున్నామని చెబుతూ అవినీతి చేసారని ఆరోపించారు. ఏపీకి ఢిల్లీకి దగ్గర పోలికలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఢిల్లీలో హై ఫొల్యూషన్ ఉందని చెప్పిన చంద్రబాబు...ఢిల్లీ టోటల్ ఫెయిల్యూర్ మోడల్ ఉందని వివరించారు. లిక్కర్ పేరుతో మొత్తం వ్యవస్థను నాశనం చేసారని పేర్కొన్నారు. ఏపీలో రుషికొండలోనూ ఇదే పరిస్థితి కల్పించారని వ్యాఖ్యానించారు. ఎమ్మార్వో కార్యాలయాలు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని చెప్పారు.

అలా చేస్తేనే భవిష్యత్
ఇదే సమయంలో ఏపీలో బటన్ నొక్కే కార్యక్రమాలు సక్సెస్ కాలేదని.. ఏపీ లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ప్రజల ఆదాయం ఎప్పటికప్పుడు పెరగాలని చంద్రబాబు సూచించారు. ప్రజల ఆదాయం పెంచడం సమర్ధవంతంగా చేస్తే గుడ్ గవర్నెన్స్ ఉంటుందని వివరించారు. మోదీ వికసిత్ భారత్..ఇక్కడ వికసిత్ ఏపీ పేరుతో భవిష్యత్ కోసం ప్రణాళికా బద్దంగా వెళ్తున్నామని చెప్పారు. తనను అరెస్ట్ చేసిన సమయంలో 60 దేశాల్లో నిరసన కనిపించిందన్నారు. తెలంగాణలో తన అరెస్ట్ కు వ్యతిరేకంగా నిరసనలను అణచివేయాలని చూసి ఫలితం అనుభవించారని వ్యాఖ్యానించారు. దీంతో, చంద్రబాబు సంక్షేమ పథకాలు - ఫలితాల గురించి చేసిన విశ్లేషణ రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+