అసెంబ్లీ సీట్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. మహిళా సాధికారిత ప్రారంభం అయింది టీడీపీతోనే అని చెప్పుకొచ్చారు. 1986లో మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు ఇచ్చారన్నారు. తమ హయాంలో మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలు.. నిర్ణయాలను వివరించారు. తల్లికి వందనం ఎంత మంది పిల్లలు ఉన్నా అంతమందికీ ఇస్తామని స్పష్టం చేసారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. నియోజవకర్గాల పునర్విభజన జరిగితే మహిళలకు దాదాపు 75 సీట్లు వస్తాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

ఆ సీట్లు వారికే

ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత గురించి అసెంబ్లీ వేదికగా వివరించారు. తెలుగుదేశం పార్టీ సిద్దాంతం జండర్ ఈక్విటీ ద్వారా ఆడవారికి సమాన అవకాశాలు కల్పించడమని తెలిపారు. ఎన్టీఆర్ 1986లో మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు ఇచ్చారన్నారు. తల్లికి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకూ ముఖ్యమంత్రిగా ఉన్నార ని మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసారు. ఇచ్చిన ఆస్తి విషయంలోనూ కోర్టుకు వెళ్లి వెనెక్కి ఇవ్వాలని అడిగారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. 2018 లో మహిళలకు పసుపు - కుంకుమ కింద ఒక్కో మహిళకు రూ 10 వేలు చొప్పున రూ 9,689 కోట్లు ఇచ్చామని చంద్రబాబు గుర్తు చేసారు.

cm-chandra-babu-interesting-comments-on-assembly-seats-delimitation-in-coming-days

అమలు చేస్తాం
ప్రస్తుత హయాంలో దీపం -2 కింద మహిళలకు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. అమరావతికి మద్దతుగా మహిళలు చేసిన ఉద్యమాన్ని చంద్రబాబు సభలో వివరించారు. 1995లో మహిళా ఎంపవర్‌మెంట్ కోసం ఆలోచిస్తూ డ్వాక్రా ఉమెన్ ద్వారా ఎంపవర్ చేయాలని నిర్ణయించామన్నారు. విద్యా, ఉద్యోగాలు, రాజకీయా ల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని తెలిపారు. దీని వల్ల ఆడబిడ్డలు చదువుకున్నారని... వారు కూడా పనిచేయడం ప్రారంభించా రన్నారు. పుట్టిన అమ్మాయి భారం కాదు ఇంటికి మహలక్ష్మి గా భావించి వారి పేరు తో ఓ 5వేలు డిపాజిట్ చేయించామని తెలిపారు. స్పీకర్‌గా ప్రతిభా భారతికి అవకాశం ఇచ్చామన్నారు.

మహిళలకే ప్రాధాన్యత
ఎనిమిది శాతంతో ప్రారంభమైన రాజకీయ రిజర్వేషన్లు స్ధానిక సంస్ధలలో 33 శాతం అయ్యింద రు. ఆడవాళ్లు మగవాళ్ళకంటే తెలివైన వారని.. ఈ విషయం చాట్ జీపీటీని అడిగినా చెపుతుందని వివరించారు. ఆర్టీసీలో ఆడ కండెక్టర్‌లు చాలా బాగా పనిచేస్తున్నారని కొనియాడారు. 65 లక్షల గ్యాస్ కనెక్షన్‌లు ఆడబిడ్డలకు ఇప్పించామన్నారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. మహిళల భద్రతకు కట్టుబడి ఉన్నామని.. పూర్తి రక్షణ కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+