జగన్ 'మావిగన్' ప్రతిపాదన వెనుక, కూటమి నేతలకు చంద్రబాబు కీలక పిలుపు..!!
అమరావతికి పార్లమెంట్ లో చట్టబద్దత వేళ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. రాజ్య సభ లో రాజధాని అమరావతి బిల్లు ఆమోదం పొందబోతోందని.. కేంద్ర సహకారంతో పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందుతోందని అన్నారు. అమరావతికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన అతి తక్కువ సమయంలోనే బిల్లును పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిందని సీఎం తెలిపారు. ఇదే సమయంలో జగన్ తాజా ప్రతిపాదనల పైనా స్పందించారు. కూటమి నేతలకు చంద్రబాబు కీలక పిలుపునిచ్చారు.
కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలి కాన్ఫిరెన్స్ నిర్వహించారు. పార్లమెంట్ లో అమరావతి రాజధానిగా చట్టబద్దత రావటంతో కూటమి నేతలకు కీలక సూచనలు చేసారు. అమరావతి మనకు ఒక సెంటిమెంట్... 5 ఏళ్ల పాటు రాజధాని లేకుండా చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు మావిగన్ అని మాట్లాడుతున్నారు... అమరావతి పట్ల వారికున్న ద్వేషానికి ఇది పరాకాష్టగా చెప్పారు. అమరావతి పేరు పలకడానికే జగన్ ఇష్టపడరని... అందుకే మావిగన్ అని వింత పేరును తీసుకొ చ్చారని . గతంలోనూ 'ఎస్ఆర్ఎం అమరావతి' అని పేరు ఉంటే... ఎస్ఆర్ఎంగా మార్పించారని గుర్తు చేసారు. అమరావతి పట్ల జగన్ వైఖరి భవిష్యత్తులోనూ మారదని నిన్నటితో మరోసారి స్పష్టమైందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మా రాజధాని అమరావతి అని ప్రతీ ఒక్కరిలో భావన రావాలని ముఖ్యమంత్రి తెలిపారు. బిల్లును ఆమోదించి చేయూతనిచ్చిన కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సాయంత్రం.. కూటమి నేతలకు చంద్రబాబు పిలుపు
రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత పార్లమెంట్‌లో ఆమోద ప్రక్రియ పూర్తయినట్లే అని చెప్పుకొచ్చారు. బిల్లు పాస్ అయినందుకు ఈ రోజు సాయంత్రం అన్ని గ్రామాల్లో పండుగలా కార్యక్రమాలు జరపాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ వారికి నచ్చిన రీతిలో రాజధాని సంబరాలు జరుపుకునే సమయమిది అని అన్నారు. ఇవాళ అమరావతి బిల్లు ఆమోదం పొందినందుకు ప్రతి ఒక్కరూ కేంద్రానికి ధన్యవాదాలు తెలపాలన్నారు. ఈరోజు మధ్యాహ్నం రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెం వెళ్తున్నట్లు తెలిపిన సీఎం.. అక్కడ రాజధాని సంబరాల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. దేశంలోని వివిధ పుణ్యస్థలాల నుంచి తెచ్చిన నీళ్లు, మట్టి ఉంచిన పవిత్ర ప్రాంతం ఉద్దండరాయునిపాలెం అని ముఖ్యమంత్రి తెలిపారు.
మన రాజధానికి స్థిరత్వం వచ్చేలా సహకరించిన ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, మద్ధతు తెలిపిన వారికి కృతజ్ఞతలు చెప్పాలన్నారు. కర్నూలులో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు కూడా సాధ్యమై నంత త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. అన్ని రాష్ట్రాల అభివృద్ధే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications