తిరుమల తరహాలో అమరావతి శ్రీవారి ఆలయంలో..ఇక నుంచి, ఇలా..!!
శ్రీవారి భక్తులకు పండుగ లాంటి వార్త. తిరుమల తరహాలోనే అమరావతిలో శ్రీవారి ఆలయం తీర్చి దిద్దేలా ప్రణాళికలు సిద్దం అయ్యాయి. తిరుమల క్షేత్ర వైభవాన్ని అమరావతిలోనే సాక్షాత్కరించే లా రూపకల్పన చేస్తున్నారు. తిరుమల ఆలయ తరహాలోనే మాడవీధులు.. పుష్కరిణితో పాటుగా స్వామివారికి నిత్య కైంకర్యాలు, ఉత్సవాలతో నిర్వహించేందుకు నిర్ణయం జరిగింది. అమరావతి కేంద్రంగా తిరుమల తరహాలో భక్తులకు కొత్త అనుభూతి కలిగేలా కసరత్తు జరుగుతోంది. ఇందుకు ముహూర్తం ఖరారైంది.
అమరావతి కేంద్రంగా శ్రీవారి ఆలయాన్ని తిరుమల తరహాలో తీర్చి దిద్దేందుకు కసరత్తు కొనసాగు తోంది. అమరావతి నిర్మాణ పనులతో పాటుగా శ్రీవారి ఆలయాన్ని అద్బుతంగా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం సిద్దమైంది. అమరావతిలోని ఆలయం చుట్టూ భారీ ప్రాకారం, ప్రధాన ముఖద్వారం వద్ద ఏడు అంతస్తులతో మహారాజ గోపురం, మూడు దిక్కుల్లో ఐదు అంతస్తులతో గోపురాలు, మాడ వీధులు, పుష్కరిణితో పాటు స్వామివారికి నిత్య కైంకర్యాలు, ఉత్సవాలతో అమరావతిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దేలా ప్రణాళిక లు సిద్దం చేసారు. అందులో భాగంగా ఈ ఆలయానికి రెండో ప్రాకారం నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నెల 27న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ పనులకు శంకుస్థాపన జరగనుంది. రేపు (గురువారం)ఉదయం 10.55 నుంచి 11.30 గంటల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళికలు సిద్దం చేసారు.

కాగా, తిరుమల ఆలయం మాదిరిగానే అమరావతిలోనూ రెండో ప్రాకారం నిర్మించనున్నారు. పడమర, ఉత్తరం, దక్షిణం దిక్కుల్లో ఐదు అంతస్తులతో గాలి గోపురాలు కట్టనున్నారు. తూర్పు వైపున ఏడు అంతస్తులతో మహా రాజగోపురం నిర్మించనున్నారు. ఆలయం లోపల, మహా రాజగోపురానికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయం, ఉత్సవ మండపం, కోనేరు వంటివి కూడా రానున్నాయి. ఈ నిర్మాణాలతో ఆలయ వైభవం మరింత పెరగనుంది. ఇప్పటికే ప్రభుత్వం వెంకటపాలెం వద్ద ప్రధాన అనుసంధాన రహదారికి, కృష్ణా కరకట్టకు మధ్యలో 25 ఎకరాలను కేటాయించింది. దేవాలయానికి లోపలి ప్రాకారం మాత్రమే ఉండగా, ఇప్పుడు వెలుపలి ప్రాకారాన్నీ నిర్మించనున్నారు. అన్నదానం కాంప్లెక్స్, అర్చకులు, సిబ్బంది క్వార్టర్లు, రెస్ట్ హౌస్, భక్తులు వేచివుండే హాల్ వంటి నిర్మాణాల్ని రూ.20 కోట్లతో చేపడతారు. రూ.20 కోట్లతో ధ్యాన మందిరాన్ని నిర్మించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి.












Click it and Unblock the Notifications