టీటీడీ ఛైర్మన్, నామినేటెడ్ పదవులు ఖరారు - అనూహ్య ఎంపిక..!!
ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటనకు సిద్దమైంది. ప్రఖ్యాత టీటీడీ ఛైర్మన్ తో పాటుగా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులను ప్రకటించనుంది. ఇప్పటికే మూడు పార్టీల నేతలు నామినేటెడ్ పదవుల భర్తీ పైన కసరత్తు చేసారు. కీలక పదవులను ఖరారు చేసారు. మూడు పార్టీల నుంచి నామినేటెడ్ పదవుల కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. దశల వారీగా పోస్టులను ప్రకటించనున్నారు. తొలి దశ విడత పోస్టులను ప్రకటించేలా ముహూర్తం ఫిక్స్ అయింది.
టీటీడీ ఛైర్మన్ గా
టీటీడీ ఛైర్మన్ పదవి కోసం టీవీ ఛానల్ యజమాని పేరు ఖరారైంది. తొలి నుంచి ఆయన పేరే ప్రముఖంగా వినిపిస్తున్నా..టీడీపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకటరావు పేర సైతం పరిశీలనలోకి వచ్చింది. అయితే ఉత్తరాంధ్రకు ఇప్పటి వరకు దక్కిన ప్రాధాన్యతతో టీటీడీ ఛైర్మన్ మీడియా సంస్థ అధినేతకే ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవులను పార్టీ సీనియర్లు.. తాజా ఎన్నికల్లో టికెట్లు దక్కని వారికి కేటాయించాలని నిర్ణయించారు.

పదవులు ఖరారు
రేపు (మంగవారం) తొలి విడత నామినేటెడ్ పదవులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. టీటీడీ ఛైర్మన్ గా బీఆర్ నాయుడు, డిజిటల్ కార్పోరేషన్ చైర్మన్ గా జివి రెడ్డి పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. అదే విధంగా దేవినేని ఉమాకు ఆర్టీసీ ఛైర్మన్, ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏపీఐఐసీ ఛైర్మన్, పట్టాబికి పౌర సరఫరాల కార్పోరేషన్, మాజీ మంత్రి పీతల సుజాతకు ఎస్సీ కమిషన్, మరో మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ కు ఎస్టీ కమిషన్ ఖరారైనట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది.
మూడు పార్టీలకు
మాల కార్పోరేషన్ ఛైర్మన్ గా ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ, మాదిగ కార్పోరేషన్ ఛైర్మన్ గా వాసం మునియ్య పేర్లు ఖాయం చేసినట్లు తెలుస్తోంది. ఇక,రాష్ట్రంలో 90 వరకూ కార్పొరేషన్లు ఉండగా వాటి చైర్మన్లు అందులో మెంబర్లు కలిసి వందల్లోనే పోస్టులు ఉన్నాయి. ఇవి మొత్తం ఒకేసారి కాకుండా విడతల వారీగా భర్తీ చేయాలని భావిస్తున్నారు. దాదాపు 30 శాతం పదవులు తొలి విడతలోనే భర్తీ చేయనున్నారు. ఇక.. పదవుల పంపకాల్లో మూడు పార్టీలు ఒక ఫార్ములా ప్రకారం పూర్తి చేయాలని నిర్ణయానికి వచ్చాయి.












Click it and Unblock the Notifications