ఢిల్లీకి చంద్రబాబు - లడ్డూ వివాదంలో కీలక మలుపు..!?
ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లడ్డూ వివాదం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారానికి కారణమైంది. వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు కొద్ది రోజులుగా లడ్డూ వివాదంలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. లడ్డూ వివాదం పైన కొనసాగుతున్న చర్చ.. వివాదం పైన సుప్రీంకు వెళ్లనున్నట్లు మాజీ సీఎం జగన్ ప్రకటించారు. కాగా.. ఇప్పుడు సీఎం చంద్రబాబు తాజా నిర్ణయం ఈ వివాదంలో కీలక మలుపుగా కనిపిస్తోంది.
ఏపీలో ఇప్పుడు లడ్డూ వివాదం పతాక స్థాయికి చేరింది. సుప్రీం ఆదేశాలతో ఏర్పాటైన సిట్ ఈ లడ్డూ వివాదం పైన విచారణ చేసింది. కోర్టులో ఛార్జ్ షీటు దాఖలు చేసింది. పలు కీలక అంశాలను ప్రస్తావించింది. డెయిరీల నుంచి నెయ్యి సరఫరా.. వినియోగం.. లావా దేవీల పైన సిట్ వివరాలు సేకరించింది. అయితే, లడ్డూ వివాదం బయటకు వచ్చిన సమయంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. యానిమల్ ఫ్యాట్ లడ్డూలో కలిసిందని చంద్రబాబు అప్పట్లో చెప్పిన అంశాలను ప్రస్తావిస్తోంది. సిట్ ఇప్పుడు లడ్డూలో అలాంటికి కలిసినట్లు రిపోర్టు లో ఎక్కడా చెప్పలేదని విశ్లేషిస్తున్నారు. ఇదే సమయంలో అసలు సూత్రధారులను తేల్చేందుకు ఏపీ ప్రభుత్వం తాజాగా విచారణ కమిషనర్ ను నియమించాలని డిసైడ్ అయింది. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈవో అనీల్ కుమార్ సింఘాల్ ను టీటీడీ నుంచి బదిలీ చేసారు.

ఢిల్లీ కేంద్రంగా కీలక మంత్రాంగం
ఇక, ఇప్పుడు ఈ వివాదం కీలక దశకు చేరుకున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈ నెల 9వ తేదీన సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. లడ్డూ వివాదంలో సిట్ ఇచ్చిన నివేదిక పైన ఢిల్లీ పెద్దలతో చర్చించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ దిశగా ఢిల్లీలో కసరత్తు జరుగుతోంది. ఏపీకి మరో బెర్తు దక్కుతుందనే అంచనా లు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ, జనసేన లో ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. అదే విధంగా జాతీయ స్థాయి నామినేటెడ్ పోస్టుల్లోనూ ఏపీకి ప్రాధాన్యత దక్కనుంది. ఈ దిశగా చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక..ఏపీకి సంబంధించిన అంశాల పైన చంద్రబాబు చర్చించనున్నారు. దీంతో.. ఈ ఢిల్లీ పర్యటన సమయంలో చోటు చేసుకునే పరిణామాలు.. నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications