ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు వేళ పార్టీ నేతలకు చంద్రబాబు కీలక దిశా నిర్దేశం..!!

సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. నామినేషన్ల సమయంలో తమను అడ్డుకున్నారంటూ వైసీపీ దాఖలు చేసిన పిటీషన్ల పైన సుప్రీంకోర్టు విచారణ చేసింది. ఈ సమయంలోనే ఎస్ఈసీకి కీలక సూచనలు చేసింది. వైసీపీ చేస్తున్న ఫిర్యాదులను పరిశీలించి నామినేషన్ల గడువు పైన నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. దీంతో... ఎస్ఈసీ కసరత్తు చేస్తోంది. ఈ సమయంలోనే పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు తాజా పరిణామాల పైన దిశా నిర్దేశం చేసారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అభ్యర్ధులు, బూత్ స్థాయి కార్యకర్తలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సుప్రీం తీర్పును వివరించారు. వైసీపీ నేతలు ఈ తీర్పును వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పని చేయాలన్నారు. జనసేన, బీజేపీలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అభ్యర్థుల ఎంపిక మొదలుకుని... ఫలితాల వరకు ప్రతి అంశాన్ని సీరియస్సుగా తీసుకోవాలని స్పష్టం చేసారు. కూటమి పార్టీల నుంచి మంచి అభ్యర్థులను ఎన్నుకుంటున్నాం... పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. లిటిగెంట్లతో అభివృద్ధిని... ఎన్నికలను అడ్డుకోవడమే గొడ్డలి పార్టీ పనిగా పెట్టుకుందని విమర్శించారు. తానే విధ్వంసానికి దిగి... తానే కోర్టుకు వెళ్లడమనే ఆలోచనలు జగన్ లాంటి క్రిమినల్ లిటిగెంట్లకే వస్తాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

సుప్రీం ఆదేశాలతో, ఆ 19 మున్సిపాల్టీల్లో - SEC కీలక నిర్ణయం, డెడ్ లైన్..!!
సుప్రీం ఆదేశాలతో, ఆ 19 మున్సిపాల్టీల్లో - SEC కీలక నిర్ణయం, డెడ్ లైన్..!!
cm-chandra-babu-made-interesting-comments-amid-supreme-court-directions-for-sec-over-ysrcp-petitions

ప్రచారం పైనా కీలక సూచనలు

ఇలాంటి క్రిమినల్ లిటిగెంట్లు ఉన్నప్పుడు పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని పేర్కొన్నారు. కోర్టు తీర్పులను కూడా వక్రీకరించేలా గొడ్డలి పార్టీ కుట్రలు పన్నుతోందని చెప్పారు. క్రిమినల్ లిటిగెంట్లు రాజకీయాల్లో ఉంటే అభివృద్ధి చేయడానికి... సంక్షేమం అందిచడానికి అడ్డంకులు కల్పిస్తారని వ్యాఖ్యానించారు. సర్ పై విమర్శలు చేశారు... సర్ పై నమ్మకం లేదన్నారు... మరోవైపు ఇదే సర్ జాబితా వచ్చే వరకు స్థానిక ఎన్నికలను జరపకూడదని కోర్టుకు వెళ్తుందని పేర్కొన్నారు. ఓటరు లిస్టుపై కోర్టుకు వెళ్లారు... బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నారు... ఇలా సుమారు 60 పిటిషన్లు హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో వేశారని చెప్పుకొచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించేలా మెగా డీఎస్సీ రిక్రూట్మెంట్ చేస్తుంటే... దాన్ని అడ్డుకునేలా 300 పిటిషన్లు వేశారని పేర్కొన్నారు. విధ్వంసాలను అడ్డుకుంటే... కోర్టులకెళ్లి ఎన్నికలను ఆపే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారానికి వారం రోజుల సమయమే ఉందని..అన్ని మున్సిపాలిటీల్లో ప్రచారం చేపట్టాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+