కేంద్రం కొత్తగా ఇచ్చిందేమీ లేదు - చంద్రబాబు వ్యాఖ్యల వెనుక..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. విభజన చట్టంలో ఉన్నవే చేశారు.. మాకు కొత్తగా చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రావలసిన పాత బకాయిలే అడుగుతున్నాం తప్ప.. కొత్తగా ఇచ్చింది ఏమీ లేదని వ్యాఖ్యానించారు. తీవ్రంగా నష్టపోయినందునే పునర్నిర్మాణానికి సాయం కోరుతున్నామని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యల పైన రాజకీయంగా చర్చ మొదలైంది. పోలవరం పైన చంద్రబాబు కేంద్ర సాయం కోరారు.

చంద్రబాబు కామెంట్స్
ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్‌కు బడ్జెట్‌లో చేసిన సాయంపై కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు తప్పుపట్టారు. తమ రాష్ట్రానికిఇచ్చిన వాటిపై రాజకీయం చేయడం సరికాదన్నారు. రాష్ట్రానికి రావలసిన పాత బకాయిలే అడుగుతున్నాం తప్ప.. కొత్తగా ఇచ్చింది ఏమీ లేదన్నారు. విభజన నష్టం కంటే గడిచిన ఐదేళ్లలో రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని చెప్పారు. రాష్ట్రానికి రావలసిన పాత బకాయిలే అడుగుతున్నాం తప్ప.. కొత్తగా ఇచ్చింది ఏమీ లేదన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని విభజన చట్టం చేసే సమయంలో కాంగ్రెస్‌ చెప్పిందిని చంద్రబాబు గుర్తు చేసారు.

CM Chandra Babu meets Central minister CR PArtil Seek support for Poalvaram

ఇచ్చిన హామీలే
రాష్ట్ర పునర్నిర్మాణం కోసం.. విభజన చట్టంలో చెప్పిన అన్నింటినీ చేయాలని అడిగాం.. అదే చేశారని వివరించారు. ఏపీ పరిస్థితికి కాంగ్రెస్ ది కూడా బాధ్యతగా చంద్రబాబు పేర్కొన్నారు. విభజన సమయంలో ఆర్థిక పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పానని.. తెలంగాణకు, ఆంధ్రకు తలసరి ఆదాయంలో సుమారు రూ.30 వేలు తేడా ఉందని, దాన్ని సరిదిద్దడం కోసమే విభజన చట్టంలో అన్ని అంశాలు చేర్చారని వెల్లడించారు. పోలవరానికి సాధ్యమైనంత త్వరగా నిధులు కేటాయించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.

నవంబర్ లో పనులు
నవంబర్ లో పనులు ప్రారంభించాలనుకుంటున్నామని, ఆ మేరకు నిధులివ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించడానికి ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచినట్లు తెలిపారు. 'కొత్త వాల్‌ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం. దాని నిర్మాణానికి అనుగుణంగా యంత్రాలను తరలించాల్సి ఉంటుందని, ఇదే విషయంపై రాష్ట్ర కేబినెట్‌లో కూడా చర్చించామని, కేబినెట్‌ నోట్‌ను కేంద్ర మంత్రికి అందించినట్లు చెప్పారు. ప్రాజెక్టు పనులపై మూడు నెలల్లో ఒక నిర్ణయం తీసుకుని పనులు చేపట్టకపోతే.. మరో సీజన్‌ కూడా కోల్పోయే అవకాశం ఉందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+