Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉచిత ప్రయాణం ఇక ఈ బస్సుల్లోనూ అమలు - సీఎం ఆదేశాలు, మార్పులు..!!

ఏపీలో ఉచిత బస్సు ప్రయాణానికి మంచి ఆదరణ కనిపిస్తోంది. ఈ నెల 15న పథకం ప్రారంభం తరువాత పెద్ద సంఖ్యలో మహిళలు ఈ పథకం వినియోగించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, అయిదు కేటగిరీల బస్సుల్లో అమలు చేస్తున్నారు. ఘాట్ రోడ్లు.. గోదావరి జిల్లాల్లో విలీన గ్రామాల్లో ఈ పథకం అమలు కావటం లేదు. తాజాగా ఈ పథకం అమలు పైన సమీక్షించిన సీఎం చంద్రబాబు అధికారులు పరిధి పెంపు పైన కీలక ఆదేశాలు ఇచ్చారు. దీంతో, మహిళలకు ఈ ప్రయాణంలో మరింత వెసులుబాటు కలగనుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఉచిత బస్సు పథకం పైన సమీక్షించారు. ఈ పథకం ప్రారంభించిన తరువాత 30 గంటల్లో రూ.ఐదు కోట్ల విలువైన జీరో టికెట్లు జారీ చేశామని ఆర్టీసీ అధికారులు చెప్పడంతో సీఎం సంతోషం వ్యక్తం చేశారు. స్త్రీ శక్తి అమలులో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. ఆధార్‌ కార్డు జిరాక్స్‌ ఉన్నా అనుమతించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.

CM Chandra Babu orders for implement Free bus in Ghat Roads also in latest review

అదే సమయంలో ఘాట్‌ రోడ్లలో ఉచిత ప్రయాణాన్ని అనుమతించాలంటూ వస్తున్న వినతులపై స్పందించిన చంద్రబాబు... అక్కడా ఉచితం అమలు చేయండి అని అధికారులను ఆదేశించారు. దీంతో, ఘాట్ రోడ్లలో ప్రయాణించే బస్సుల్లోనూ ఇక ఈ పథకం అమలు కానుంది. తిరుపతి- తిరుమల ఘాట్ రోడ్ లో ప్రయాణించే బస్సుల విషయం పైన అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

అదే విధంగా సెలవు రోజులు కావడంతో ఆదివారం వరకూ రద్దీ తక్కువగానే ఉంటుందని, సోమవారం నుంచి పెరిగే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. కాగా, స్పెషల్ బస్సుల్లో ఈ పథకం అమలు కాదని అధికారులు చెబుతున్నారు. పండుగలు, కొన్ని ప్రముఖ ఆలయాలకు రద్దీ వేళ నడిపే ప్రత్యేక బస్సుల్లోనూ ఈ పథకం అమలు విషయంలో కొంత స్పష్టత లోపించింది.

CM Chandra Babu orders for implement Free bus in Ghat Roads also in latest review

అదే విధంగా ప్రయాణీకుల నుంచి ప్రభుత్వం ఫీడ్ బ్యాక్ తీసుకుంటోంది. అందులో పలువురు పథకం అమలు చేస్తున్న బస్సుల రూట్ల సంఖ్య పెంచాలి అని ఎక్కువ సంఖ్యలో కోరుతున్నారు. దీంతో పాటుగా బస్సు వేళల్లో సమయ పాలన పాటించాలి అనే సూచన ఎక్కువగా వచ్చింది. ఇక.. ఈ పథకం అమలు చేసే బస్సులకు ప్రత్యేక రంగుతో నడపాలని కోరుతున్నారు. వీటి పైన ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+