వర్మ, వంగవీటికి కీలక పదవులు: చంద్రబాబు- పవన్ ఎంపిక..!!
ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఈ రెండు స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వైసీపీకి చెందిన ఇద్దరు సభ్యుల రాజీనామా..వేటు కారణంగా ఈ ఉప ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్యే కోటా ఎన్నిక కావటంతో ఈ రెండు స్థానాలు తాజా ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించిన కూటమికే దక్కనున్నాయి. ఈ రెండు స్థానాలకు ఎవరిని ఎంపిక చేయాలనే అంశం పైన సీఎం చంద్రబాబు -డిప్యూటీ సీఎం పవన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్సీల ఎంపిక
రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 25వ తేదీన ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. అదే రోజు నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలవుతుంది. వాటి దాఖలుకు జూలై 2ను తుది గడువుగా పేర్కొన్నారు. మర్నాడు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు జూలై 5గా ఈసీ పేర్కొంది. అనివార్యమైతే జూలై 12వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. వైసీపీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ రాజీనామా, మరో ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్యపై అనర్హత వేటుపడడంతో ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి.

ఈ ఇద్దరి వైపు మొగ్గు
ఈ రెండు స్థానాలు కూటమి అభ్యర్దులకు ఏకగ్రీవం కానున్నాయి. వైసీపీకి అసెంబ్లీలో సంఖ్యా బలం లేకపోవటంతో పోటీ చేసే అవకాశం లేదు. ఇక...ఈ పదవుల పైన చంద్రబాబు - పవన్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పిఠాపురం నుంచి పవన్ పోటీ ప్రకటన సమయంలో అక్కడ టీడీపీ ఇంఛార్జ్ గా ఉన్న సమయంలోనే ఎమ్మెల్సీ హామీ దక్కింది. పవన్ గెలుపుకు సహకరించాలని చంద్రబాబు నాడు కోరారు. పవన్ కు భారీ మెజార్టీ వెనుక వర్మ కష్టపడ్డారని జనసేన నేతలు అభినందించారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి ఎమ్మెల్సీ ఆయనకే ఇవ్వనున్నారు.
వర్మ-వంగవీటికి ఛాన్స్
అదే విధంగా వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ ఇవ్వాలని నిర్ణయించారు. 2019 ఎన్నికల సమయంలోనే వైసీపీ నుంచి రాధా టీడీపీలో చేరారు. అప్పుడు ఎన్నికల్లో పోటీకి సీటు దక్కలేదు. అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ, 2019 లో టీడీపీ అధికారంలోకి రాలేదు. తాజా ఎన్నికల్లోనూ కూటమి గెలుపు కోసం పని చేసారు. పవన్ తోనూ సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో.. నాడు ఇచ్చిన హామీ మేరకు వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో మరి కొందరికి ఇదే తరహాలో ఎమ్మెల్సీ హామీలు దక్కాయి. తొల విడతలో ఈ ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు ఖాయంగా కనిపిస్తున్నాయి.
-
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications