చంద్రబాబు, పవన్ లో సడన్ ఛేంజ్- ఢిల్లీ కేంద్రంగా..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఆర్దికంగా ఉన్న సమస్యలతో కేంద్ర సహకారంపైన భారీగా ఆశ ల పెట్టుకుంది. కేంద్రం ఇప్పటికే అమరావతి, పోలవరంతో పాటుగా ఇతర అంశాల్లోనూ ఆర్దికంగా సహకారం అందిస్తోంది. ఇక.. కూటమిగా కొనసాగుతున్నా, రాజకీయంగా బలం పెంచుకునేందుకు మూడు పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే సమయంలో ఢిల్లీ కేంద్రంగా ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఢిల్లీలో చంద్రబాబు, పవన్
ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ నూతన సీఎం గా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్‌తో చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో పోలవరానికి రూ.12 వేల కోట్లు కేటా యించగా.. నిధులు విడుదలపై కేంద్రమంత్రితో చర్చించారు. అలాగే పోలవరం కుడి, ఎడమ కాలువలను 17,500 క్యూసెక్కుల నీటి తరలింపు సామర్థ్యంతో నిర్మించేందుకు అవసరమైన ఆర్థిక సహాయంపైనా విజ్ఞప్తి చేశారు. అయితే, చంద్రబాబు - పవన్ ఇద్దరూ కలిసి ఢిల్లీ కేంద్రంగా ఏపీ అంశాల పైన కలిసి భేటీ అవ్వటం ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.

ఇద్దరూ కలిసి
ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన సమయంలో ఒకరే వెళ్లేవారు. ప్రధానితో సహా పలు శాఖల కు సంబంధించిన అంశాల పైన కేంద్ర మంత్రులతోనూ భేటీ అయ్యేవారు. ఆ తరువాత పవన్ ఢిల్లీ వెళ్లిన సమయంలోనే ఆయనే నేరుగా కేంద్ర మంత్రులతో రాష్ట్ర అంశాల పైన చర్చించారు. కాగా, ఇప్పుడు చంద్రబాబు - పవన్ కలిసి కేంద్ర మంత్రితో పోలవరం అంశం పైన చర్చించారు. కొద్ది రోజులుగా ఏపీలో టీడీపీ - పవన్ మధ్య కొంత గ్యాప్ కనిపిస్తోందని రాజకీయంగా చర్చ సాగుతోంది. పవన్ అస్వస్థతకు గురైన సమయంలో పరామర్శకు చంద్రబాబు ప్రయత్నించగా, పవన్ అందు బాటులోకి రాలేదు. ఈ విషయాన్ని స్వయంగా మంత్రులు - కార్యదర్శుల సమావేశంలో చంద్ర బాబు వెల్లడించారు.

అమిత్ షా తో భేటీ
కీలకమైన పోలవరం విషయంలో ఇప్పుడు ఇద్దరూ కేంద్ర మంత్రిని కలిసారు. మధ్నాహ్నం అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చిస్తారు. సాయంత్రం 4: 45 గంటలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తోనూ చంద్ర బాబు సమావేశం అవుతారు. మిర్చి ధర పతనం కావడంతో కష్టాలలో ఉన్న రైతులను ఆదుకునేం దుకు సహాయం చేయాలని కేంద్రమంత్రిని కోరనున్నారు. దీనిపై కేంద్రానికి ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి లేఖలు రాశారు. అనంతరం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ బయల్దేరనున్నారు.












Click it and Unblock the Notifications