విశాఖ కేంద్రంగా ఇక.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక అంశాలను వెల్లడించారు. విశాఖ కేంద్రంగా తమ లక్ష్యాలను స్పష్టం చేసారు. బేసిటీ ప్రాజెక్ట్ యాంకర్ ప్రాజెక్టుగా పెట్టుకుని విశాఖపట్నం రీజియన్ అభివృద్ధి చేపట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. సూక్ష్మస్థాయి ప్రణాళిక ద్వారా విశాఖపట్నం రీజియన్ మొత్తం అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేసారు. ప్రతి రంగాన్ని పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు.

విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేసారు. పలు రంగాల్లో కీలకమైన ప్రాజెక్టుల ద్వారా రూ. 9.50 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించేలా విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టు రూపకల్పనకు నిర్ణయించారు. రూ 3.50-4 లక్షల కోట్ల మేర ప్రభుత్వ పెట్టుబడులు .. ప్రైవేట్ రంగం నుంచి రూ. 5.30 లక్షల కోట్లు రాబట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. సూక్ష్మ స్థాయి ప్రణాళిక ద్వారా విశాఖ రీజియన్ మొత్తం అభివృద్ధి చేయాలి అనదే వీఈఆర్ ప్రాజెక్టు లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేసారు. వీఈఆర్ పరిధిలో ఉన్న ప్రతి ప్రాంతాన్ని... ప్రతి రంగాన్ని పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి ప్రణాళికలను సిద్దం చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. అదే విధంగా ఏఐ డేటా సెంటర్ల ఎకో సిస్టం, పోర్టు ఆధారిత పరిశ్రమలు, టూరిజం, హైడ్రోజన్, క్లీన్-టెక్ ఎనర్జీ వంటి వాటి పైన స్పష్టత ఇచ్చారు.

 డీలిమిటేషన్ పై ఊహించని నిర్ణయం, మారుతున్న లెక్కలు- ఇక నెక్స్ట్.!!
డీలిమిటేషన్ పై ఊహించని నిర్ణయం, మారుతున్న లెక్కలు- ఇక నెక్స్ట్.!!
cm-chandra-babu-reviews-visakha-economic-region-master-plan-targets-120-billion-economy-by-2032

సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం

కాగా, మూలపేట పోర్టు నుంచి రాజమహేంద్రవరం అఖండ గోదావరి ప్రాజెక్టు వరకూ వీఈఆర్ అభివృద్ధిలో భాగంగా ఉండాలని సీఎం సూచన చేసారు. వివిధ ప్రాజెక్టులను అనుసంధానించటం ద్వారా విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రగతి సాధించాలని స్పష్టం చేసారు. నిధుల కన్వర్జెన్స్ ద్వారా వీఈఆర్ పరిధిలో అభివృద్ధి చేపట్టాలని నిర్దేశించారు. అవసరమైన మేరకు వీజీఎఫ్ స్కీంను అమలు చేయాలని సూచించారు. వివిధ ప్రాజెక్టులను అనుసంధానించటం ద్వారా విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ప్రగతి సాధించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నిధుల కన్వర్జెన్స్ ద్వారా వీఈఆర్ పరిధిలో అభివృద్ధి చేపట్టాలని స్పష్టం చేసారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+