ధైర్యం ఉందా - కడప గడ్డ పై జగన్ కు చంద్రబాబు సవాల్..!!
కడప కేంద్రంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. మాజీ సీఎం జగన్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ... సవాల్ విసిరారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని.. ఈ విధ్వంసాన్ని సరిచేస్తామని ఎన్నికల ముందు చెప్పిన విషయాన్ని గుర్తు చేసారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధే లక్ష్యంగా పల్లె పండుగ 3.0ను చేపట్టామన్నారు. మదనపల్లె హార్టికల్చర్ హబ్‌తో రాయలసీమ దశ-దిశ మారబోతోందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసారు.
కడప జిల్లా ప్రొద్దుటూరు లో సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్.. జల్‌జీవన్ మిషన్ 2.0-అమరజీవి జలధార పనులను ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధే లక్ష్యంగా పల్లె పండుగ 3.0ను చేపట్టామని సీఎం చంద్రబాబు చెప్పారు. మదనపల్లె హార్టికల్చర్ హబ్‌తో రాయలసీమ దశ-దిశ మారబోతోందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. కర్మయోగి ద్వారా ప్రతి ఉద్యోగిలో నైపుణ్యం పెంచుతామని వెల్లడించారు. పాన్ IITద్వారా టెక్నాలజీని తదుపరి దశకు తీసుకెళ్తామని.. పాన్ IIT కౌన్సిల్ అమరావతిలో ఏర్పాటు కాబోతుందని తెలిపారు. కడప అభివృద్ధిపై చర్చకు సిద్ధం అంటూ మాజీ సీఎం జగన్ కు ముఖ్యమంత్రి సవాల్ విసిరారు. కేంద్రం నుంచి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.లక్ష కోట్లు తీసుకుందని.. ఏపీ కంటే చిన్న రాష్ట్రం అసోం రూ.34వేల కోట్లు తీసుకుందని తెలిపారు. గతంలో ఉన్న ప్రభుత్వం కేవలం రూ.2,016 కోట్లు తీసుకుందని.. గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్ అంటూ విరుచుకుపడ్డారు.

ప్రత్యర్ధి హద్దు మీరితే
కాగా.. గోదావరి-కావేరి నదుల అనుసంధానం తన కోరిక అని చెప్పుకొచ్చారు. కరవు సమయంలో నూ 2వేల టీఎంసీలు సముద్రం పాలయ్యాయన్నారు. నదుల అనుసంధానంతో 4 రాష్ట్రాలకు సాగునీటి కష్టాలు తొలగుతాయని తెలిపారు. లిక్కర్ స్కాంలో అంతిమ లబ్ధిదారు గొడ్డలి పార్టీ అధినేత అని వేళ్లు చూపిస్తున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సమాధానం చెప్ప్పే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. వాళ్లు నేరాలు చేసి ఎదుటివారిపై ఆరోపణలు చేస్తారని మండిపడ్డారు. కుట్రలే గొడ్డలి పార్టీ సిద్ధాంతమన్నారు. వివేకా హత్య కేసులో వాస్తవాలన్నీ బయటకు వచ్చాయని పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామని వ్యాఖ్యానించారు. కాగా.. ఇది రాజకీ యాలు మాట్లాడే సమయం కాదని డిప్యూటీ సీఎం పవన్ చెప్పుకొచ్చారు. రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దని డిప్యూటీ సీఎం చెప్పారు. యుద్ధం వచ్చినప్పుడే కదా మాట్లాడాల్సింద ని పేర్కొన్నారు. ప్రత్యర్థి హద్దు మీరితేనే యుద్ధం చేసేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
