జేసీకి చంద్రబాబు వార్నింగ్..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి నేతల వివాదాల పై ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే వీటిని సహించేది లేదని హెచ్చరించారు. అయినా, వారిలో మార్పు రాకపోవటం పైన గుర్రుగా ఉన్నారు. తాజాగా చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కడప ఆర్టీపీపీ బూడిద తరలింపు వివాదంలో జేసీ, జమ్మల మడుగు ఎమ్మెల్యే అదినారాయణ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగింది. చంద్రబాబు చెప్పినా వారిద్దరూ వినలేదు. దీంతో, ఈ పంచాయితీ సీఎంఓకు చేరింది.
ఆర్టీపీపీ నుంచి బూడిద తరలింపు వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కూటమి లో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, బీజేపీ నేతలు ఈ వివాదంలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డారు. ఆర్టీపీపీ నుంచి ఫ్లై యాష్ తరలింపు కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి.. జమ్మల మడుగు బీజేపీ ఎమ్మెల్యే అదినారాయణ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. ఇద్దరి మద్దతు దారులు తామే బూడిద తరలిస్తామంటూ ముందుకొచ్చారు. దీంతో, రెండు వర్గాల మొహరింపుతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసు బలగాలు మొహరించారు. మూడు రోజుల పాటు సాగిన ఈ వివాదం పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇద్దరినీ సీఎంఓకు రావాలని ఆదేశించారు.

ఎమ్మెల్యే అదినారాయణ రెడ్డి అమరావతిలో సీఎంను కలిసారు. ఘటనకు సంబంధించిన పూర్వా పరాలను వివరించారు. ఇలాంటి వివాదాల కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని సీఎం పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పా రు. సీఎంతో భేటీకి జేసీ దూరంగా ఉన్నారు. కాగా, అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా సీఎం
అక్కడ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డితో ఇదే అంశం పై మాట్లాడారు. ఈ వివాదాలు ఏంటని ప్రశ్నించారు.బూడిద తరలింపు వ్యవహారంలో ఇలా రోడ్డును పడితే పార్టీ పరువు ప్రతిష్టలు ఏం కావాలని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఎవరిష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తే ఇక పార్టీ ఎందుకని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. కాగా,కార్యకర్తలకు పని కల్పించేందుకే ఇలా వ్యవహరించాల్సి వచ్చిందని అస్మిత్ రెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారని తెలుస్తోంది. దీనికి స్పందనగా కార్యకర్తల సంగతి తాను చూసుకుంటా నని, ఇలాంటివి మాత్రం కొనసాగితే సహించేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. అటు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.. ఇటు జేసీకి చంద్రబాబు క్లాస్ తీసుకోవటంతో ప్రస్తుతానికి ఆర్టీపీపీ బూడిద వ్యవహారం సర్దుమనిగింది.












Click it and Unblock the Notifications