కూటమి నేతలకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేలా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తే ఏమాత్రం సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించనని తేల్చి చెప్పారు. కూటమిలో భాగస్వాములు గా ఉన్న పార్టీల నేతలు క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీ లేకుండా కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పుడు ఈ వ్యవహారం కూటమిలో చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబు ఆగ్రహం
ఆర్టీపీపీ నుంచి బూడిద తరలింపు వ్యవహారంలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి .. జమ్మల మడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య ఈ వివాదం ప్రతిష్టగా మారింది. ఇద్దరు నేతల మద్దతు దారులు తమ మాట నెగ్గించుకొనేందుకు పంతం పట్టారు. దీంతో, ఆర్టీపీపీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు రోజులుగా ఈ వివాదం కొనసాగుతోంది. ఇద్దరు నేతలు వెనక్కు తగ్గకపోవటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసారు. దీంతో, ఈ వివాదం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఇద్దరు తీరు పైన సీరియస్ అయ్యారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఘటనపై జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఇద్దరు నేతల పంతం
రాయలసీమ బొగ్గు విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి బూడిద తరలింపు విషయంలో ఆధిపత్య పోరు పై సీఎం చంద్రబాబు ఆరా తీసారు. జేసీ, ఆదినారాయణ రెడ్డి తీరు పైన అసంతృప్తి వ్యక్తం చేసా రు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా నేతల వ్యవహారం ఉందని సీరియస్ అయ్యారు. శాంతి భద్రత ల విషయంలో ఎక్కడా సమస్య రాకుండా చూడాలని..ఈ విషయంలో కఠినంగా ఉండాలని ఉన్న తాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మొత్తం ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు. ఆర్టీపీపీలోని ఉచిత బూడిద కోసం జమ్మలమడుగు, తాడిపత్రికి చెందిన కూటమి నేతలు తమ ఆధిపత్యం కోసం రోడ్డెక్కటం కూటమిలో చర్చగా మారింది. అధికారంలో ఉన్న రెండు పార్టీల నేతలు ఇలా వ్యవహరిస్తే నష్టపోతామనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
పోలీసుల అప్రమత్తం
తాడిపత్రి నుంచి ఫ్లయాష్ కోసం లారీలు వస్తే అడ్డుకుంటారనే సమాచారంతో పోలీసులు భారీగా మోహరించారు. జేసీకి చెందిన లారీలు ఆర్టీపీపీ వద్దకు వచ్చినా బూడిద లోడు చేయకుండా నిర్వాహకులు నిలిపివేశారు. జేసీ కాంట్రాక్టులో తమకు సగ భాగం ఇవ్వాలని స్థానికులు పట్టు బడుతున్నారు. ఈ వివాదం తో కడప - అనంతపురం సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. తాడిపత్రి నుంచి జేసీ మద్దతుదారులు ఆర్టీపీపీకి వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అక్కడ మొహరించారు. ఇప్పుడు సీఎం జోక్యం చేసుకొని హెచ్చరించటంతో ఈ ఇద్దరు నేతలు వెనక్కు తగ్గుతారా.. అదే పంతం కొనసాగిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఇద్దరు నేతల విషయంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications