వారిని వదులుకోవటానికీ సిద్దం, సర్వేల్లో తేలిందిదే - చంద్రబాబు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీలో గాడి తప్పుతున్న వారికి ఇప్పటికే పలు మార్లు హెచ్చరికలు చేసామని.. ఇంకా కొందరిలో మార్పు రాలేదన్నారు. దేనికైనా ఒక పరిమితి ఉంటుందని.. కొన్నాళ్లు భరిస్తామని వ్యాఖ్యానించారు. గతంలోనూ ఇలాంటి వారిని వదులుకుంటేనే.. తిరిగి అధికారం దక్కిందని గుర్తు చేసారు. ఇప్పుడు వారిని వదులుకోవటానికి సిద్దమని తేల్చి చెప్పారు. తాజా సర్వేలో వెల్లడైన అంశాలను వివరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. గాడి తప్పిన వారి విషయంలో తన వైఖరి స్పష్టం చేసారు. పార్టీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. కేంద్రం కీలక బిల్లులను సభ లో ప్రవేశ పెడుతున్న వేళ.. పార్టీ వైఖరిని స్పష్టం చేసారు. కేంద్రం తీసుకొచ్చే బిల్లులకు మద్దతు గా నిలవాలని సూచించారు. ఆక్వా ఫీడ్ ధరల తగ్గింపు వంటి అంశాల పైన చర్చించాలని ఎంపీల కు నిర్దేశించారు.

ఇదే సమయంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల పైనా ప్రస్తావించారు. ప్రభుత్వ పని తీరు పైన ప్రజల్లో సానుకూల స్పందన ఉందని.. గాడి తప్పుతున్న కొందరు నాయకుల పైన ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు సర్వేల్లో తెలుస్తుందని చంద్రబాబు వివరించారు. అలాంటి వారిని దారిలో పెడతామని చెప్పారు. కొందరు అధికారులు తేడాగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. వారినీ సెట్ రైట్ చేస్తానని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు హెచ్చరిక
గతంలోనే గాడి తప్పిన వారిని హెచ్చరిక చేసామని చంద్రబాబు గుర్తు చేసారు. వాళ్లతో పాటే అందరినీ ముంచుతామంటే సహించనని స్పష్టం చేసారు. 1999 లో అలాంటి వారిని వదులు కున్నాక ప్రజలు మళ్లీ గెలిపించారని చెప్పారు. వివాదాలకు అతీతంగా ఉండే వాళ్లే గెలుస్తారని వ్యాఖ్యానించారు. ఎంపీలు..ఎమ్మెల్యే లు సమన్వయం తో ఉండాలని సూచించారు. మంచి కోసం. చెబుతుంటే కొందరు.

ఎమ్మెల్యే లు..బయట కామెంట్ చేస్తున్నారని కొందరు సమావేశంలో ప్రస్తావన చేసారు. ఇలాంటివి తప్పవని చెప్పిన చంద్రబాబు.. తనను కూడా చాటున తిట్టుకునే వళ్లు ఉంటారని ..అవన్నీ తప్పవని చెప్పుకొచ్చారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ, క్యాడర్ ను అర్దం చేసుకుని ముందుకు వెళ్తేనే నాయకులుగా ఎదుగుతామని పేర్కొన్నారు.













Click it and Unblock the Notifications