మరోసారి ఇలా జరిగితే ఊరుకోను...టిడిపి ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్
Recommended Video

అమరావతి: అసెంబ్లీ సమావేశాల తొలిరోజే టీడీపీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి స్ట్రాంగ్ వార్నింగ్ ఎదురైంది. శాసనసభ సమావేశాల ప్రారంభానికి ముందు అసెంబ్లీ సమీపంలోని వెంకటపాలెంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించి అక్కడ నుంచి నేరుగా అసెంబ్లీకి రావాలని చంద్రబాబు నిర్ణయించారు.
అయితే ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత,ముఖ్యమంత్రే స్వయంగా పాల్గొంటున్నా...కార్యక్రమం గురించి ముందుగానే హెచ్చరించినా చివరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలసి కేవలం పదిహేను మంది మాత్రమే హాజరయ్యారు. దీంతో ఆగ్రహించిన చంద్రబాబు ఆ తర్వాత అక్కడనుంచి వచ్చేశాక ఉభయ సభల విప్‌లను పిలిచి వారికి గట్టిగా క్లాస్ తీసుకొన్నారు. వివరాల్లోకి వెళితే...

ఎపి అసెంబ్లీ అమరావతికి మారాక వెంకటపాలెంలోని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులు అర్పించి అసెంబ్లీకి వెళ్లడం సీఎం చంద్రబాబు ఆనవాయితీగా పెట్టుకున్నారు. హైదరాబాద్‌లో సమావేశాలు జరిగినప్పుడు చంద్రబాబు ఇదేవిధంగాఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించి వెళ్ళేవారు.
అయితే తాజాగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించే ఈ కార్యక్రమంలో శాసన సభ,శాసనమండలి నుంచి పట్టుమని 15మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొన్న ఈ ముఖ్యమైన కార్యక్రమానికి రాలేదు. టిడిపి నుంచి ఉభయసభల్లో దాదాపు 160మంది ప్రజాప్రతినిథులు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
దీనిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి లోనైనట్లు తెలిసింది. ఇలా చేయడం పార్టీకి సరైన గౌరవం ఇచ్చినట్లు కాదంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారట. అంతేకాదు చంద్రబాబు ఆ తర్వాత అక్కడనుంచి రాగానే ఉభయ సభల విప్‌లను పిలిచి వారికి గట్టి హెచ్చరిక చేశారు. "పార్టీ ఒక కార్యక్రమం చేయాలని అనుకొంటే అందరూ పాల్గొనాలి...పదవులు రాగానే పెద్దవాళ్ళు కారు...బాధ్యతలు పెరుగుతాయి. వాటికి న్యాయం చేయాలి...నేను రాగా లేనిది మీకు ఇబ్బంది ఏమిటి?...ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఠంచనుగా పాల్గొనేవాళ్ళు...అధికారంలోకి రాగానే బద్ధకస్తులుగా మారితే ఎలా?...మరోసారి ఇలా జరిగితే ఊరుకోను"...అని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications