చంద్రబాబు బిగ్ డెసిషన్, పక్కా వ్యూహం- కీలక మలుపు..!!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తవుతోంది. ఈ ఆరు నెలల పాలన పైన కూటమి నేతలు సమీక్షకు సిద్దమయ్యారు. భవిష్యత్ లక్ష్యాలను ఫిక్స్ చేస్తున్నారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గాల వారీగా తన ప్రణాళికల అమలుకు సిద్దం అవుతున్నారు. ఇందు కోసం ఇప్పటికే కసరత్తు తుది దశకు చేరుకుంది. దీని ద్వారా ఎమ్మెల్యేలకు టాస్క్ ఫిక్స్ చేస్తున్నారు. ఈ ప్రణాళికలు అమలు జరిగితే వచ్చే ఎన్నికల నాటికి రాజకీయంగా ఇది కీలక మలుపు కానుంది.
ఆరు నెలల పాలన
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరు నెలల పాలన పూర్తవుతున్న వేళ కొత్త లక్ష్యాలను ఫిక్స్ చేస్తు న్నారు. అందులో భాగంగా ఈ నెల 11, 12 తేదీల్లో కలెక్టర్ల సదస్సుకు నిర్ణయించారు. రెండు రోజుల షెడ్యూల్ ను అధికారులు ఖరారు చేసారు. ఈ సారి సదస్సులో గతం కంటే భిన్నంగా సీఎం చంద్రబాబు కీలక ఆవిష్కరణలను సిద్దం అవుతున్నారు. ఈ సారి రాష్ట్ర స్థాయి నుంచే కాకుండా జిల్లా, నియోజకవర్గ స్థాయి విజన్ డాక్యుమెంట్లను చంద్రబాబు ప్రకటించనున్నారు. వీటి అమలు పైన కలెక్టర్లకు దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్న శాఖల్లో ఈ ఆరు నెలల కాలంలో వచ్చిన మార్పు.. తీసుకురావాల్సిన మార్పుల పైన చర్చించనున్నారు.

మార్గనిర్దేశం
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వాట్సప్ గవర్నెన్స్ తో పాటుగా సచివాలయాల సేవల ప్రక్షాళన పైన కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గ్రామాల్లో సౌకర్యాల మెరుగుదల, సంక్షేమ పథకాల అమలు గురించి కలెక్టర్లకు మార్గదర్శకం చేయనున్నారు. రెండో రోజు సదస్సులో జిల్లా ఎస్పీలను భాగస్వాములను చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, డ్రగ్స్ కట్టడి చర్యలు, బెల్టు షాపుల నియంత్రణ, ఉచిత ఇసుక పర్యవేక్షణ వంటి వాటి పైన సమీక్ష చేయనున్నారు. తొలి కలెక్టర్ల సమావేశంలో ఇచ్చిన అజెండా అమలు పైన చర్చ జరగనుంది. అదే విధంగా అభివృద్ధి - సంక్షేమం పైన ఈ సమావేశంలో ప్రభుత్వం అధికారులకు దిశా నిర్దేశం చేయనుంది.
వ్యూహాత్మక నిర్ణయాలు
అదే సమయంలో వ్యవసాయం, నీటి పారుదల అంశాల పైన ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఇక,భూముల పైన పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో భూ రికార్డుల పరిశీలన..ఫిర్యాదుల పరిష్కారం పైన ప్రభుత్వం కీలక సూచనలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశంలో డిప్యూ టీ సీఎం పవన్ సైతం అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు మరింత పక్కాగా అమలయ్యేలా ఈ రెండు రోజుల సదస్సు ద్వారా ప్రభుత్వం కార్యాచరణ ఖరారు చేయనుంది. నియోజకవర్గాల విజన్ విడుదల చేయటం ద్వారా ఎమ్మెల్యేలు.. అధికారులు సమిష్ఠి గా అమలు కోసం ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో, రాజకీయంగానూ ఈ విజన్ ఆవిష్కరణ ఆసక్తి కరంగా మారుతోంది.
-
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications