ఉద్యోగులకు గుడ్ న్యూస్ - పీఆర్సీ, బకాయిల పై చంద్రబాబు స్పష్టత, రేపే ముహూర్తం..!!
ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్ అందుతోంది. ఉద్యోగుల తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు ప్రారంభించారు. కొద్ది రోజులుగా ఉద్యోగ సంఘాలు.. ప్రభుత్వం మధ్య కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జేఏసీ సంఘం నేత బొప్పరాజు చేసిన వ్యాఖ్యల పైన ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. ఇదే సమయంలో ఉద్యోగుల సమస్యల పైన తాజాగా సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. తానే స్వయంగా చర్చలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు ముహూర్తం ఫిక్స్ చేసారు.
ఏపీలో ఉద్యోగుల జేఏసీ నేతల తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతూ కొత్త కార్యాచరణ అమలు చేస్తున్నారు. తమకు రావాల్సిన పీఆర్సీ.. బకాయిల చెల్లింపు పైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. దశల వారీ ఆందోళన ప్రారంభించారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ఆందోళన ప్రారంభించారు. ఇదే సమయంలో జేఏసీ నేత బొప్పరాజు వ్యవహార పైన నేరుగా మంత్రి అనగాని ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనికి బొప్పరాజు స్పందించారు. తాము ఉద్యోగుల సమస్యల పైనే స్పందిస్తున్నామని.. రాజకీయ అజెండా లేదని తేల్చి చెప్పారు. కాగా.. ఈ సమయంలో సీఎం చంద్రబాబు ఉద్యోగుల సమస్యల పరిష్కారం పైన స్పష్టత ఇచ్చారు. అందులో భాగంగా రేపు (శనివారం) జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో సీఎం చంద్రబాబు ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ కానున్నారు.

రేపు చంద్రబాబు తో కీలక సమావేశం
ఈ భేటీలో పీఆర్సీ కమిషన్ ఏర్పాటుతో పాటు పీఆర్సీ, డీఏ బకాయిలు తదితర సమస్యలపై చర్చించనున్నారు. గురువారం ఏపీ జేఏసీ నేతలు సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల ఆందోళనలకు సంబంధించిన అంశాలను విద్యాసాగర్ వివరించారు. పెండింగ్లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రిని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం ఈ సందర్భంగా వారికి చెప్పారు. పరిష్కారంపై చర్చిస్తున్నా.. ఎందుకు తొందర పడుతున్నారని చంద్రబాబు ఏపీ జేఏసీ నేతలను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఉద్యోగులకు న్యాయంగా చేయాల్సిన వాటిని ఒక్కొక్కటిగా చేస్తున్నామని చెప్పినట్టు సమాచారం. చర్చలు జరుపుతున్నా ఓర్పు పట్టలేకపోవటాన్ని ప్రశ్నించినట్టు తెలిసింది. దీంతో.. చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. ఏం చెబుతారనే ఉత్కంఠ ఉద్యోగుల్లో కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications