Viral Video: వీడెవడండీ బాబు. దొంగలకే ఫ్యూజులు ఎగిరిపోయాయి!

స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. రోజుకో వింత లోకానికి స్వాగతం పలుకుతోంది. రోజూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వింతలు, విశేషాలకు సంబంధించిన వీడియోలు చూస్తూనే ఉంటాం. కొన్ని నవ్వు తెప్పిస్తే, మరికొన్ని మాత్రం 'వామ్మో.. ఇదేం ఐడియా రా బాబు' అని ఆశ్చర్యపోయేలా చేస్తాయి. సరిగ్గా అలాంటి ఒక విచిత్రమైన సంఘటనే ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విదేశాలకు వెళ్లే తొందరలో, తన ప్రాణప్రదమైన కారు దొంగలపాలు కాకూడదని ఒక వ్యక్తి వేసిన మాస్టర్ ప్లాన్ చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.

బీహార్‌కి చెందిన ఒక వ్యక్తి కొద్దిరోజుల్లో ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లాల్సి ఉంది. అయితే అతనికి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. దాదాపు రూ.15 లక్షలకు పైగా విలువ చేసే తన ప్రియమైన 'మహీంద్రా స్కోర్పియో' కారును ఇంటి బయట పార్క్ చేసి వెళ్తే, ఎక్కడ దొంగలు ఎత్తుకెళ్తారోనన్న భయం పట్టుకుంది. సాధారణంగా అయితే ఎవరైనా పెయిడ్ పార్కింగ్ సెంటర్లలో పెట్టడమో, లేదంటే తెలిసిన బంధువుల ఇంట్లో దాచడమో చేస్తారు. కానీ మనోడి ఆలోచన మాత్రం దానికి పూర్తి భిన్నం! ఎవరికీ అందనంత ఎత్తులో కారును ఉంచితే పోలా అనుకున్నాడో ఏమో గానీ.. ఏకంగా ఒక పెద్ద క్రేన్‌ను రప్పించాడు.

Bihar Man Uses Crane to Lift Mahindra Scorpio Classic SUV to Rooftop to Prevent Theft Before Going Abroad

క్రేన్‌తో ఇంటి పైకప్పు మీదికి..

అంతే నిమిషాల్లో ఇంటి ముందు క్రేన్ ప్రత్యక్షమైంది. వీధిలోని జనాలందరూ ఏం జరుగుతుందో అని ఆశ్చర్యంగా చూస్తుండగానే.. భారీ స్కోర్పియో కారును క్రేన్ సహాయంతో గాల్లోకి లేపి, నేరుగా తన ఇంటి స్లాబ్ పైకి చేర్చాడు. అలా కారు భద్రంగా ఇంటి పైకప్పు మీదకు చేరడంతో ఆ యజమాని హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. "దొంగల భయానికి ఇదొక కొత్త రకం విరుగుడు", "దేశంలో టాలెంట్‌కు కొదవలేదు" అంటూ నెటిజన్లు విచిత్రమైన కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

'నాలాలు కడిగేటోడా' అని ఎగతాళి చేశారు.. ఈ రోజు పద్మ విభూషణ్ ఇవ్వాలంటున్నారు
'నాలాలు కడిగేటోడా' అని ఎగతాళి చేశారు.. ఈ రోజు పద్మ విభూషణ్ ఇవ్వాలంటున్నారు

ఐడియా ఓకే.. మరి రిస్క్ సంగతేంటి?

యజమాని ఆలోచన వినడానికి వింతగా, జోక్యాగా అనిపించినా.. ఇందులో చాలా ప్రమాదాలు ఉన్నాయని భవన నిర్మాణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్కోర్పియో లాంటి భారీ ఎస్‌యూవీల బరువు చాలా ఎక్కువగా ఉంటుంది. అంతటి భారాన్ని తట్టుకునేలా సాధారణ ఇళ్ల పైకప్పులు డిజైన్ చేయరు. కారు బరువుకు భవనం దెబ్బతినే ప్రమాదం ఉంది. అంతేకాదు, ఎండకు, వర్షానికి కారు పైనే ఉండిపోవడం వల్ల రంగు మారడమే కాకుండా, ఇంజిన్ సమస్యలు కూడా వస్తాయి. మళ్లీ విదేశాల నుంచి వచ్చాక ఆ కారును కిందకు దించడం అంత తేలికైన విషయమేమీ కాదని కొందరు అంటున్నారు.

నాకే ఎందుకీ శిక్ష దేవుడా? ఒంటికాలితో కుంటుతూ బడికి చిన్నారి, కన్నీరు పెట్టించే వీడియో
నాకే ఎందుకీ శిక్ష దేవుడా? ఒంటికాలితో కుంటుతూ బడికి చిన్నారి, కన్నీరు పెట్టించే వీడియో

కార్ల భద్రతకు అసలైన మార్గాలు ఇవే!

సొంత వాహనాల భద్రత కోసం ఇలాంటి ప్రమాదకరమైన ప్రయోగాలు చేయడం కంటే కొన్ని తేలికపాటి మార్గాలను ఎంచుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. విదేశాలకు లేదా సుదూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు కారుకు వీల్ లాక్ వేయడం, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ అమర్చడం, సీసీటీవీ కెమెరాల నిఘా ఉన్న చోట పార్క్ చేయడం లేదా నమ్మకమైన కస్టడీ పార్కింగ్ సెంటర్లకు అప్పగించడం సురక్షితం. ఇలాంటి క్రేన్ ప్రయోగాలు సరదాగా అనిపించినా.. జేబుకి, ఇంటికి రెండింటికీ భారీ కన్నం వేసే ప్రమాదం ఉందని మరచిపోవద్దు!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+