ప్రధాని మోదీకి చంద్రబాబు కీలక ప్రతిపాదన..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. దావోస్ కేంద్రంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ద్వారా ప్రపంచ వేదికపై ఏపీలో పెట్టుబడుల కోసం పలు ప్రముఖ సంస్థలను ఆహ్వానించారు. ఆ తరువాత ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ప్రధానితోనూ కలిసే అవకాశం ఉంది. ఈ సమయంలో చంద్రబాబు కీలక ప్రతిపాదన చేసేందుకు సిద్దమయ్యారు. కేంద్ర బడ్జెట్ వేళ చంద్రబాబు ప్రతిపాదన ఏపీకి కీలక మలుపుగా మారనుంది.
ఢిల్లీలో చంద్రబాబు
దావోస్ పర్యటన ముగించుకున్న చంద్రబాబు నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలవనున్నారు. దావోస్ వేదికగా పలువురు పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు సమావేశాలు నిర్వహించారు. ప్రభు త్వ పాలసీలు, అవకాశాలు, ఆలోచనలను వివరించి పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ సంస్థలకు ఆహ్వానం పలికారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. ప్రధానితోనూ కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమావేశాల్లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టనున్న 2024-25 వార్షిక బడ్జెట్ లో కేటాయింపుల కోసం చర్చలు చేయనున్నారు.

బడ్జెట్ వేళ చర్చలు
ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పోలవరం-బనకచర్ల అనుసం ధాన ప్రాజెక్టు నిధుల అంశాన్ని కేంద్రం వద్ద ప్రస్తావించనున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధుల్లో సగం కేంద్రం కేటాయించాలని చంద్రబాబు కోరుతున్నారు. మిగిలిన నిధులను ఇతరత్రా మార్గాల ద్వారా సేకరించాలని చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. అందులో భాగంగా ఈ రోజు పర్యటనలో ఆర్దిక, జలవనరుల శాఖ మంత్రులను కలిసి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపాదన లు అందించనున్నారు. వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖల మంత్రులతో నూ భేటీ కావాలని చంద్రబాబు నిర్ణయించారు.
కీలక ప్రతిపాదన
ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం 12 గంటలకు మాజీ రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్‌ని మర్యాదపూర్వకంగా కలుస్తారు. అనంతరం కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ తరువాత విజయవాడ బయలుదేరనున్నారు. సమయం ఇస్తే పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని సైతం సీఎం చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. అయితే, కేంద్రం నుంచి మద్దతు కోరుతున్న వేళ.. ఈ సారి బడ్జెట్ కేటాయింపు పైన ఏపీ ప్రభుత్వం భారీ అంచనాలతో ఉంది. దీంతో, ఇప్పుడు చంద్రబాబు మరోసారి ఏపీ అవసరాలను ఈ రోజు సమావేశాల్లో కేంద్రానికి నివేదించనున్నారు. మరి , కేంద్రం ఈ సారి బడ్జెట్ లో ఏపీకి ఎలాంటి కేటాయింపులు చేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications