వర్మ, రాధాకు పదవుల ఖరారు - అక్కడే అసలు ట్విస్ట్..!!
ఏపీలో రెండు విడత నామినేటెడ్ పదవులు భర్తీ చేసారు. కూటమి ప్రభుత్వంలోని మూడు పార్టీల నుంచి అవకాశం దక్కింది. అయితే, పిఠాపురం వర్మ .. వంగవీటి రాధ కు మాత్రం ఎలాంటి పదవి ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన తరువాత భర్తీ చేసిన ఎమ్మెల్సీల సమయం లోనూ వర్మకు ఛాన్స్ దక్కలేదు. దీంతో, తాజాగా వర్మ తో పాటుగా వంగవీటి రాధాకు కు ఇచ్చే పదవి పైన చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో ఆ పదవుల ఖరారులో కొత్త ట్విస్ట్ ఇప్పుడు తెర మీదకు వచ్చింది.
నాడు హామీలు
పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్ గా ఉన్న వర్మకు ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. పవన్ గెలుపు కోసం పని చేయాలని.. వర్మ భవిష్యత్ తాను చూసుకుంటానని చంద్రబాబు చెప్పారు. తొలుత వర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసినా.. ఆ తరువాత పవన్ కు భారీ మెజార్టీ రావటం లో వర్మ క్రియాశీలకంగా పని చేసారు. పవన్ సైతం ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పారు. కానీ, కూటమి అధికారంలోకి వచ్చిన ఈ అయిదు నెలల కాలంలో పిఠాపురంలో వర్మకు తగిన గౌరవం జనసేన కేడర్ నుంచి దక్కటం లేదనే అభిప్రాయం ఉంది. ఇక, ఇటు వర్మకు హామీ ఇచ్చినట్లుగా పదవి ఏదీ కేటాయించ లేదు.

ఎమ్మెల్సీ హామీ
అదే విధంగా వంగవీటి రాధాకు 2019 ఎన్నికల ముందే ఎమ్మెల్సీ సీటు పైన హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకు అమలు కాలేదు. తాజా ఎన్నికల్లోనూ రాధా కూటమికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు రెండో విడత నామినేటెడ్ పదవులు భర్తీ తరువాత వర్మ తో పాటుగా రాధాకు త్వరలోనే ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని తాజాగా హామీ అందినట్లు సమాచారం. అయితే, ఎమ్మెల్సీ సీటు కోసం ఇదే విధంగా ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన పలువురు టీడీపీ సీనియర్లు ఆశిస్తున్నారు. వారిలో కొందరికి రెండో విడత నామినేటెడ్ పదవుల సమయంలోనే వారికీ పదవుల కేటాయింపు పైన చర్చ జరిగింది. కానీ, ఆ నేతలు మాత్రం తమకు ఎమ్మెల్సీలుగానే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
పెరుగుతున్న పోటీ
ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న వారిలో దేవినేని ఉమా, పరిటాల శ్రీరామ్, వంగవీటి రాధ, బీదా రవిచంద్ర,బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ వంటి వారు ఉన్నారు. అదే విధంగా జనసేన నుంచి ఇద్దరు నేతలు, బీజేపీ నుంచి ఒక సీనియర్ సైతం ఎమ్మెల్సీ పదవి కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అటు వైసీపీ ఎమ్మెల్సీలు చేసిన రాజీనామాల పైన ఛైర్మన్ ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. ఇటు సీనియర్ల నుంచి కూటమి పైన ఒత్తిడి పెరుగుతోంది. దీంతో, వర్మ .. రాధా కు ఎమ్మెల్సీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications