మరో ఎన్నికల హామీ అమలు - వారి ఖాతాల్లో నిధుల జమ..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీ అమలు ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరకు లబ్దిదారుల ఖాతాల్లో నిధుల జమ కానున్నాయి. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తుండగా ఇతర పథకాల అమలుకు కసరత్తు కొనసాగుతోంది. అందులో భాగంగా మరో పథకం అమలు పైన చంద్రబాబు నిర్ణయం ప్రకటించారు.
ఎన్నికల హామీ అమలు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మత్య్సకార భరోసా నిధులు పెంచి విడుదల చేసేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఈ నెల 26వ తేదీ నుంచి మత్స్యకార భరోసాను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. మత్స్యకారులకు చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని స్వయంగా సీఎం అందజేయనున్నారు. రూ.20 వేలు భృతి ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. బుడగట్లపాలెం వెళ్లనున్న సీఎం మత్స్యకారులకు భృతిని అందజేసి వారితో ముఖాముఖి నిర్వహించనున్నారు.

26న ఖాతాల్లో జమ
మత్స్యకారులతో ప్రజావేదిక నిర్వహణతో పాటు పార్టీ నేతలతోనూ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. రొయ్యలు, చేపలు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేస్తాయి. ఇందుకు 2 నెలల సమయం పడుతుంది. తద్వారా ఇవి మత్స్యకారుల ఉపాధికి దారి చూపుతాయి. ఈ కారణంతోనే ఏటా చేపల నిషేధం అమలులో ఉంటుంది. ఈ సమయంలో మర, ఇంజిన్ బోట్లు వేటకు దూరంగా ఉండాలి. కర్ర తెప్పలకు ఎలాంటి ఆంక్షలు ఉండవు. మత్స్యకారలు నిబంధనలు అతిక్రమించకుండా అధికార యంత్రాంగం పర్యవేక్షణ చేస్తుంది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 15 ఏళ్ల కిందటి వరకు బియ్యం ఇచ్చేవారు. ఆ తర్వాత నగదు అందిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా
అర్హత కలిగిన వారికి మత్స్యకార భరోసా కింద రూ.20 వేల చొప్పున ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు అమలు చేస్తోంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications