తిరుమల చరిత్ర తెలుసుకోండి, రూల్స్ పాటించండి, చంద్రబాబు
తిరుమల పవిత్రతను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓ ట్వీట్ చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు అత్యంత నియమనిష్టలతో, భక్తి శ్రద్దలతో స్వామివారిని ఆరాధిస్తారని, భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల పుణ్యక్షేత్రాన్ని మనం కాపాడాలని సీఎం చంద్రబాబు నాయుడు మనవి చేశారు.
ఈ పవిత్ర పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉండటం మనం చేసుకున్న పుణ్యం అని, మనం ఇప్పుడు టీటీడీ నియమ, నిబంధనలు కాపాడటం మనందరి బాధ్యత, కర్తవ్యం అని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. దేశ విదేశాల్లో ఉన్న కోట్లాదిమంది హిందువులకు తిరుమల అతిపెద్ద పుణ్యక్షేత్రం అని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఆగమశాస్త్ర ఆచారాలను, టీటీడీ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని సీఎం చంద్రబాబు మనవి చేశారు.

తిరుమల శ్రీవారి ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవ్వరూ వ్యవహరించవద్దని, టీటీడీ నిబంధనలను అందరూ తప్పకుండా పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికి మనవి చేశారు. శ్రీవారి భక్తుల మనోభావాలు, తిరుమల ఆచారాలకు విరద్దుంగా ఎవ్వరూ ప్రవర్తించకూడదని విజ్ఞప్తి చేస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారికి కోట్లాదిమంది భక్తులు ఉన్నారని, హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రం తిరుమల అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
తిరుమలలో నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించి ఆంధ్రప్రదేశ్ కు మంచి పేరు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం శుక్రవారం జగన్ తిరుమల వెళ్లాల్సి ఉంది. అయితే అదే రోజు సీఎం చంద్రబాబు నాయుడు ఈ ట్వీట్ చేశారు. జగన్ తిరుమల వెళ్ళిన తర్వాత డిక్లరేషన్ పై సంతకం చేయాలని హిందూ సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న సమయంలో చంద్రబాబు ఈ ట్వీట్ చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్ ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వంపైన, మాజీ సీఎం చంద్రబాబుపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications