అది వాళ్ల తలరాత!, దురదృష్టం వెంటాడితే ఇలాగే: ఏర్పేడుపై తేల్చేసిన బాబు

ఏర్పేడు ప్రమాద ఘటనలో ఆర్టీఐ అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందన్నారు చంద్రబాబు. బాధ్యులను పదేళ్లు బొక్కలో తోస్తే గానీ దారికి రారన్నారు.

న్యూఢిల్లీ: లారీ సృష్టించిన బీభత్సంతో ఊరంతా వల్లకాడులా మారిపోయిన ఏర్పేడు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇదంతా బాధితుల తలరాత అని ఆయన అభివర్ణించిన తీరు విస్మయానికి గురిచేస్తోంది.

నీతి ఆయోగ్ మూడో గవర్నింగ్ కౌన్సిల్ భేటీకి హాజరైన సందర్బంగా ఆదివారం రాత్రి ఢిల్లీలోని ఏపీ భవన్ లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఏర్పేడు ప్రమాద ఘటన బాధాకరమని చెప్పిన ఆయన.. ఒక్కోసారి దురదృష్టం వెంటాడినప్పుడు ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అన్నారు. ఒకవైపు బాధ, మరోవైపు డెస్టినీ, ఒక్కోసారి డెస్టినీ ఇలా చేస్తుందని పేర్కొన్నారు.

ఎమ్మార్వోపై చర్యలు:

ఎమ్మార్వోపై చర్యలు:

ఒక ఆందోళన కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. గ్రామస్తుల ఆందోళనకు కారణమైన ఇద్దరు టీడీపీ నాయకులు ధనుంజయ నాయుడు, చిరంజీవి నాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వాళ్ల అరెస్టుకు కూడా ఆదేశాలిచ్చామని అన్నారు. ప్రజలు ఫిర్యాదు చేసినప్పుడే ఎమ్మార్వో చర్యలు తీసుకుని ఉంటే ఇంత జరిగేది కాదన్నారు. కాబట్టి ఎమ్మార్వోను కూడా సస్పెండ్ చేస్తున్నామన్నారు.

పదేళ్లు బొక్కలో తోయాలి:

పదేళ్లు బొక్కలో తోయాలి:

ఏర్పేడు ప్రమాద ఘటనలో ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందన్నారు చంద్రబాబు. బాధ్యులను పదేళ్లు బొక్కలో తోస్తే గానీ దారికి రారన్నారు. ఇకనుంచి తాగి వాహనం నడిపేవారి లైసెన్స్ రద్దయ్యేలా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఘటనలో ఏర్పేడు ఎస్ఐపై కూడా ఆరోపణలు ఉండటంతో.. దీనిపై సీనియర్ ఐఏఎస్ అధికారితో విచారణ జరిపిస్తామని తెలిపారు.

మాకూ వెబ్ సైట్ ఉంది..:

మాకూ వెబ్ సైట్ ఉంది..:

సోషల్ మీడియాను నియంత్రించడంపై స్పందిస్తూ.. భావ ప్రకటన స్వేచ్చ ఉండాలి కానీ సభ్యత లేకుండా ఇష్టానుసారం పోస్టులు పెడితే ఎలా? అని చంద్రబాబు ప్రశ్నించారు. తమకూ ఓ వెబ్ సైట్ ఉందని, కానీ అందులో ఎప్పుడూ అసభ్యకర పోస్టులు పెట్టలేదని అననారు. సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ కు సహాయం చేయాలని నీతి ఆయోగ్ భేటీలో తాను ప్రధానిని కోరినట్లు చంద్రబాబు తెలియజేశారు. దాంతో పాటు విశాఖకు రైల్వే జోన్ ఇవ్వాలని కూడా అడిగామన్నారు.

ముందస్తుకు సిద్దమే:

ముందస్తుకు సిద్దమే:

ఇక దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలకు తాము సంసిద్దంగానే ఉన్నామన్నారు చంద్రబాబు. దీనిపై ఎలాంటి వ్యతిరేకత లేదని, అంతా అనుకూలమేనని తెలిపారు. అయితే దీనిపై రాజకీయంగా ఏకాభిప్రాయం సాధించాల్సి ఉందన్నారు. కాగా, ఆదివారం నాడు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో భేటీ అయిన చంద్రబాబు రాష్ట్రంలో భూసేకరణ అంశంపై చర్చించినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+