రన్‌వేపై కుప్పకూలిన విమానం! (వీడియో)

మహారాష్ట్రలోని పుణే జిల్లా బారామతి ఎయిర్పోర్టులో ఆదివారం మధ్యాహ్నం 12,35 గంటల ప్రాంతంలో కార్వార్ ఏవియేషన్‌కు చెందిన శిక్షణా విమానం ప్రమాదానికి గురైంది. విమానం రన్‌వేపై కదులుతున్న(టాక్సీయింగ్) సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదానికి గల కచ్చితమై కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

ఈ ప్రమాద వివరాలను పుణే ఎస్పీ వెల్లడించారు. బారామతి ఎయిర్‌ఫీల్డ్‌లో శిక్షణలో భాగంగా సర్క్యూట్, అత్యవసర ల్యాండింగ్ విన్యాసాలను సాధన చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ విమానంలో కెప్టెన్ చిరాగ్ శశికాంత్ దోయిఫోడే , క్యాడెట్ పైలట్ అభిజీత్ జుండ్రే ఉన్నారు. ఈ ఘటనపై విమానయాన అధికారులు, స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విమానానికి సంబంధించిన సాంకేతిక లోపమా లేక ల్యాండింగ్ సమయంలో తలెత్తిన ఇతర కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. రన్‌వేపై విమానం నియంత్రణ కోల్పోవడానికి గల కారణాలను విశ్లేషిస్తున్ారు. మరిన్ని వివరాలు దర్యాప్తు పూర్తయిన తర్వాత వెలువడే అవకాశం ఉంది.

Training Aircraft Crashes at Baramati Airport in Maharashtra Pilots Escape Unhurt Full Details

గతంలోనూ వరుస ప్రమాదాలు
బారామతి ప్రాంతంలో గత కొన్ని నెలలుగా వరుసగా విమాన ప్రమాదాలు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. దాదాపు 7 నెలల క్రితం జనవరి 28న విమానం ల్యాండింగ్ సమయంలో కూలిపోవడంతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మే 13న కూడా గోజుబావి గ్రామం వద్ద ఓ శిక్షణా విమానం విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కూలిపోయింది. నేటి ప్రమాదంతో ఈ ప్రాంతంలో ఏవియేషన్ భద్రతపై మళ్లీ చర్చ మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+