ఏపీ వైపు దూసుకొస్తున్న అక్వాన్ తుపాను, ఈ జిల్లాలకు భారీ ముప్పు- సీఎం కీలక ఆదేశాలు..!!
ఏపీకి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. ఆర్నాబ్ తుఫాను తరహాలో అక్వాన్ సైతం విరుచుకు పడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవాళ సాయంత్రానికి వాయు గుండంగా ఆ తదుపరి తుపానుగా బలపడే సూచనలు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఈనెల 19 రాత్రికి లేదా 20 మధ్యాహ్నానికి అతి తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ తుపాను నెల్లూరు - తుని మధ్య లేదా మచిలీపట్నం - గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు.
అక్వాన్ తుఫాను పై ప్రభుత్వం అప్రమత్తం అయింది. వాయుగుండం ప్రభావం.. తుఫానుగా మారే అవకాశాలు.. చేపట్టాల్సిన చర్యల పైన సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అక్వాన్ తుపానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇవాళ సాయంత్రానికి వాయుగుండంగా ఆ తదుపరి తుపానుగా బలపడే సూచనలు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. కేంద్ర బృందం చేసిన సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకుని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ నెల 19, 20వ తేదీల్లో కోస్తాంధ్ర తీరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. అర్నబ్ తరహాలోనే ఈ తుపాను ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని సీఎంకు అధికారులు వివరించారు.

సాయంత్రం తుఫానుగా మారుతుందని అంచనా
కాగా, కోనసీమ, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు సహా పలు జిల్లాల్లో ప్రభావం ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈనెల 19 రాత్రికి లేదా 20 మధ్యాహ్నానికి అతి తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ తుపాను నెల్లూరు - తుని మధ్య లేదా మచిలీపట్నం - గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తుపాను తీరం దాటే సమయంలో మొదట 90 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయి. ఈనెల 19 ఉదయం నుంచి 20 ఉదయం వరకు ఏపీ తీరం వెంబడి గంటకు ఏకంగా 145 కి.మీ వేగంతో భయంకరమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications
